బిజినెస్

విద్యుత్ వాహనాల ఇంధన ధర ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ నెలాఖరుకు రెండు రాష్ట్రాల విద్యుత్ డిస్కాంమ్‌లు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే విద్యుత్ ధరలను మూడేళ్ళ వరకు పెంచవద్దని కేంద్రం గట్టిగా చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ నింపే ప్రక్రియను కిలోవాట్ అవర్ (కెడబ్య్లూహెచ్)గా పిలుస్తారు. గంట సమయంలో వాహనానికి విద్యుత్‌ను ఎంత నింపుతారో వాటిని కిలోవాట్ అవర్ అంటారు. తెలంగాణలో కిలోవాట్ అవర్ ధర రూ. 6.40 పైసలు, ఆంధ్రప్రదేశ్‌లో వాటి ధర రూ. 6.95 పైసలుగా ఆయా రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. కిలోవాట్ విద్యుత్‌ను వాహనానికి నింపడం ద్వారా నాలుగు చక్రాల వాహనం 20-25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గంటూరు జిల్లాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు రయ్‌మంటూ పరుగుతీయనున్నాయి. ఈ మేరకు ఇటీవల సిమ్లాలో జరిగిన రాష్ట్రాల విద్యుత్ డిస్కంమ్‌ల సమీక్షా సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే రాష్ట్రాలకు భారీగా రాయితీలను అందచేస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ నింపే కేంద్రాల ఏర్పాటుకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల కోసం తెలుగు రాష్ట్రాల డిస్కంమ్‌లు త్వరలో ప్రకటన చేయనున్నాయి. సిమ్లాలో జరిగిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల విద్యుత్ డిస్కంమ్ సీఎండీలు హాజరయ్యారు. రఘుమారెడ్డి (హైదరాబాద్), నాగేశ్వరరావు (వరంగల్), హెచ్‌వై దొర (విశాఖపట్నం), ఎంఎం రాయక్ (తిరుపతి) పాల్గొన్నారు. సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎండీలు హాజరయ్యారు.