బిజినెస్

33.7 శాతం తగ్గిన ఉక్కు ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో శుద్ధి చేసిన ఘనరూపంలో ఉన్న ఉక్కు (్ఫనిష్‌డ్ స్టీల్) ఎగుమతులు 33.7 శాతం పడిపోయి, 1.351 మిలియన్ టన్నులకు చేరాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో భారత్ 2.037 మిలియన్ టన్నుల ఫినిష్‌డ్ స్టీల్‌ను ఎగుమతి చేసిందని జాయింట్ ప్లాంట్ కమిటీ (జేపీసీ) తన తాజా నివేదికలో వివరించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తున్న జేపీసీ దేశంలోని ఉక్కు, ఇనుము పరిశ్రమలకు సంబంధించిన గణాంకాలను సేకరించి భద్ర పరుస్తుంటుంది. ‘2018 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఫినిష్‌డ్ స్టీల్ ఎగుమతులు 33.7 శాతం తగ్గి, 1.351 మిలియన్ టన్నులకు చేరాయి’ అని ఆ నివేదిక పేర్కొంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ భారత్ తన మొత్తం ఉక్కు ఉత్పత్తిలో కనీసం ఆరు నుంచి ఏడు శాతం ఉక్కును ఎగుమతి చేయవలసి ఉంటుందని ఇదివరకే ప్రకటించి ఉన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు 10.9 శాతం పెరుగుదలతో 1.893 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో దిగుమతులు 1.707 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ మొత్తం ఫినిష్‌డ్ ఉక్కు ఉత్పత్తి 4.4 శాతం వృద్ధితో 26.720 మిలియన్ టన్నులకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 25.605 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది. 2017 ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో దేశంలో ఫినిష్‌డ్ ఉక్కు వినియోగం 8.4 శాతం పెరుగుదలతో 23.422 మిలియన్ టన్నులకు చేరింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో దేశంలో ఉక్కు వినియోగం 21.598 మిలియన్ టన్నులుగా ఉంది.