బిజినెస్

సీఎండీ పదవి ఇక ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతి ఎయిర్‌టెల్ సహా మొత్తం 291 లిస్టెడ్ కంపెనీలు 2020 ఏప్రిల్ ఒకటో తేదీనాటికి తమ బోర్డులలో ఒక నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌ను నియమించవలసి ఉంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇది తప్పనిసరి. అలాగే వీటిలో చాలా కంపెనీలు తమ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పోస్టులను వేరు చేయవలసి ఉంటుంది. అంటే ఈ రెండు పోస్టులకు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ రెండు పోస్టులను సీఎండీ (చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్)గా కలిపేశాయి. దీనివల్ల బోర్డ్, మేనేజ్‌మెంట్ కొన్ని సందర్భాలలో ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. ఇది పరస్పర ప్రయోజనాలకు దారితీస్తోంది. సెబీ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం మార్కెట్ విలువ ఆధారంగా టాప్ 500 లిస్టెడ్ సంస్థలు 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి తమ చైర్‌పర్సన్ ఒక నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. దీనివల్ల చివరికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులను వేరు చేయవలసి ఉంటుంది. అంటే ఈ రెండు పోస్టులకు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఉండవలసి ఉంటుంది. సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ నియమించిన కోటక్ కమిటీ చేసిన వరుస సిఫార్సులలో భాగంగా ఈ కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లిస్టయిన టాప్ 500 కంపెనీలలో 291 కంపెనీలు (58.2 శాతం) తమ సంస్థలలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్లను నియమించవలసి ఉంటుంది. దీంతో పాటు ఎండీ/సీఈఓ, చైర్‌పర్సన్ పోస్టులను వేరు చేయవలసి ఉంటుంది.