బిజినెస్

జీఎస్‌టీ గరిష్ట శ్లాబ్ నుంచి 191 వస్తువులకు మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: వస్తు సేవా పన్ను అమలుకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో 191 వస్తువులను గరిష్ట శ్లాబ్ నుంచి తక్కువ శ్లాబ్ పరిధిలోకి తెచ్చారు. మరో 35 వస్తువులు మాత్రమే గరిష్ట శ్లాబ్‌లో ఉన్నాయి. వీటిల్లో ఏసీలు, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్లు, వంటపాత్రలు కడిగే మెషీన్లు, ఆటోమొబైల్స్ ఉన్నాయి. 2017 జూలై 1వ తేదీన వస్తు సేవా పన్ను అమలు రోజు 28 శాతం శ్లాబ్ పరిధిలో 226 వస్తువులు ఉండేవి. రాష్ట్రప్రభుత్వా వత్తిడి మేరకు, ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనల మధ్య జీఎస్‌టీ మండలి అనేక సార్లు సమావేశమై గరిష్ట శ్లాబ్ పరిధి నుంచి 191 వస్తువులను దిగువ శ్లాబ్‌కు తెచ్చింది. కాగా గరిష్ట శ్లాబ్‌లో సిమెంట్, మోటారు వాహనాలు, ఎయిర్ క్రాఫ్ట్‌లు, పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలాలు, ఉన్నాయి. జీఎస్‌టీ ఆదాయం పెరిగే కొద్దీ, పరోక్ష పన్నుల విధానాన్ని మరింత హేతుబద్ధీకరణ చేసే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. 28 శాతం శ్లాబ్ పరిధి నుంచి మరిన్ని వస్తువులను దిగువ శ్లాబ్‌కు రానున్నరోజుల్లో తెచ్చే అవకాశం ఉంది. కేవలం సూపర్ లగ్జరీ, పొగాకు, సిగరెట్లను మాత్రమే పెద్ద శ్లాబ్ పరిధిలోకొనసాగిస్తారన్నారు.
డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏసీలు, డిజిటల్ కెమెరాలను కూడా 18 శాతం శ్లాబ్ పరిధిలోకి తెస్తారన్నారు. ప్రస్తుతం 28 శాతం జీఎస్‌టీ పరిధిలో కేవలం 35 వస్తువులు మాత్రమే ఉన్నాయి. 28 నుంచి 18 శాతానికి పన్ను తగ్గించిన వస్తువుల జాబితా 15 వరకు ఉంటుందన్నారు. శ్లాబ్ మార్చడం వల్ల ఆరువేల కోట్ల రూపాయల రెవెన్యూ తగ్గుతుందన్నారు. ఇది కేవలం అంచనా మాత్రమేనని, వినిమయ వస్తువుల అమ్మకం పెరిగే కొద్దీ రెవెన్యూ పెరుగుతుందన్నారు.