బిజినెస్

కార్పొరేట్ల ఆదాయాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో కదలికలతో పాటు రాజకీయ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. విదేశీ ఫండ్‌ల పెట్టుబడులు, డెరివేటివ్‌ల కాంట్రాక్టుల గడువు ముగింపు వంటి అంశాలను కూడా మదుపరులు సునిశితంగా పరిశీలిస్తారని వారు పేర్కొన్నారు. ‘ఎన్‌డీఏ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రభావం ఇప్పుడు ఉండదు. ఓటింగ్ ముగిసి, తీర్మానం వీగిపోయినందున మార్కెట్ దృక్పథం వైపునుంచి చూస్తే దీని ప్రభావం ఇంకెంత మాత్రం ఉండదు. మార్కెట్‌ను ప్రభావితం చేసే రాజకీయ ఈవెంట్లు 2018 చివరలో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటాయి. కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్‌ఐఐల) నిధుల రాకపోకలు వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రభావితం చేస్తాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ‘కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ వచ్చే వారం ఊపందుకుంటుంది. కంపెనీల ఆదాయాల వృద్ధిలో ఏమైనా పురోగతి ఉంటే వాటి షేర్ల విలువలో మార్పు ఉంటుంది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. వచ్చే వారం తమ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న ప్రధాన సంస్థలలో ఆసియన్ పెయింట్స్, భెల్, కెనరా బ్యాంక్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఐటీసీ, మారుతి సుజుకి, టాటా పవర్, యెస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. ‘ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నందున కొంత వరకు రాజకీయ క్లిష్ట సమస్యలు మార్కెట్‌లో ఊగిసలాట ధోరణికి దారితీయవచ్చు. సంస్కరణల అజెండా వేగవంతం అవుతుందనే అంచనా ఉంది. అదే జరిగితే సాధారణంగా మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది’ సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జిమీత్ మోదీ పేర్కొన్నారు. డెరివేటివ్‌ల గడువు గురువారంతో ముగియనున్నందున అది కూడా మార్కెట్‌లో ఊగిసలాటను ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ‘డెరివేటివ్‌ల గడువు ముగింపు కూడా మార్కెట్ ఊగిసలాటను పెంచుతుందని మేము భావిస్తున్నాం’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో కదలికలను కూడా మదుపరులు గమనిస్తుంటారని నిపుణులు పేర్కొన్నారు. గత వారంతో పోలిస్తే శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 45.26 పాయింట్లు (0.12 శాతం) పడిపోయి, 36,496.37 పాయింట్ల వద్ద ముగిసింది.