బిజినెస్

కనీస బ్యాలెన్స్ లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను ఉంచకపోతే పెనాల్టీలు వసూలు చేస్తారు జాగ్రత్త. గత ఏడాది 21 ప్రభుత్వ రంగ సంస్థలు, మూడు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు కనీస బ్యాలెన్స్‌ను ఖాతాల్లో ఉంచనందు వల్ల కస్టమర్ల నుంచి రూ.5వేల కోట్లను వసూలు చేశాయి. మొత్తం వసూలు చేసిన ఐదు వేల కోట్ల రూపాయల్లో సగానికి సగం ఎస్‌బీఐకు వెళ్లాయి. ఎస్‌బీఐ 2017-18 సంవత్సరంలో రకరకాల కారణాల వల్ల రూ.6547 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయింది. కాని మినిమన్ బ్యాలెన్స్ ఉంచని ఖాతాల నుంచి భారీ మొత్తంలోనే పెనాల్టీ చార్జీలను వసూలు చేసింది. మినిమమ్ బ్యాలెన్స్ లేనందు వల్ల కస్టమర్ల నుంచి పెనాల్టీని వసూలు చేసిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ రెండవ స్థానంలో నిలిచింది. కస్టమర్ల నుంచి రూ. 590.84 కోట్లను, ఐసీఐసీఐ రూ.317.6 కోట్లను వసూలు చేసింది. ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో పెనాల్టీని 2012 వరకు వసూలు చేసింది. ఆ తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసి 2017 నుంచి ప్రవేశపెట్టింది. విమర్శలు రావడంతో గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి పెనాల్టీ చార్జీలను తగ్గించింది. కాగా బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీం కింద ఉన్న కస్టమర్లు కనీస బ్యాలెన్స్‌ను ఉంచాల్సిన అవసరం లేదు.