బిజినెస్

వచ్చేస్తోంది..ఐపీపీబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: గ్రామీణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21న ఐపీపీబీని ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక సేవలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఐపీపీబీ శాఖ దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటయినా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ‘ఐపీపీబీని ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21న సమయం ఇచ్చారు. ఈ బ్యాంకు రెండు శాఖలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గల అన్ని జిల్లాల్లోనూ సేవలు అందించేందుకు వీలుగా మిగతా 648 శాఖలను ప్రారంభించడం జరుగుతుంది’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఆ సీనియర్ అధికారి ఒక వార్తాసంస్థకు వివరించారు. ఐపీపీబీ 1.55 లక్షల తపాలా కార్యాలయాల శాఖలను ఉపయోగించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రజలకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందిస్తుంది. ‘ప్రభుత్వం ఈ సంవత్సరాంతం నాటికి మొత్తం 1.55 లక్షల పోస్ట్ ఆఫ్‌స్ శాఖలను ఐపీపీబీ సేవలతో అనుసంధానం చేయడానికి కృషి చేస్తోంది’ అని ఆ అధికారి వివరించారు. దీనివల్ల గ్రామ స్థాయిలో పనిచేసే దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్ ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఐపీపీబీ 650 శాఖలతో పాటు తపాలా కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసే 3,250 యాక్సెస్ పాయింట్లు, 11వేల మంది తపాలా సిబ్బందితో కలిసి దేశవ్యాప్తంగా ప్రజల ఇళ్ల వద్దకే బ్యాంకింగ్ సేవలను అందిస్తుందని ఐపీపీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సురేశ్ శెట్టి గత వారం చెప్పారు. ఐపీపీబీ దేశంలోని సుమారు 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ (పీఎస్‌బీ) ఖాతాలను తన ఖాతాతో అనుసంధానం చేసుకోవడానికి అనుమతి పొందింది.