బిజినెస్

సెబీ దర్యాప్తులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీ మోసపూరితంగా భారీ మొత్తంలో రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు పురోగతిలో ఉందని ఒక సీనియర్ అధికారి శనివారం చెప్పారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు మెహుల్ చోక్సీపై సెబీ ఎన్నడూ ఎలాంటి క్లీన్‌చిట్ నివేదికను ఆంటిగువా అధికారులకు ఇవ్వలేదని ఆ అధికారి స్పష్టం చేశారు. పీఎన్‌బీని గీతాంజలి జెమ్స్ మోసగించిన ఉదంతానికి సంబంధించి మెహుల్ చోక్సీ- నీరవ్ మోదీ ద్వయం, వారి సహచరులు, కొంతమంది బ్రోకర్లు క్యాపిటల్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించిన అభియోగాలపై సెబీ తన దర్యాప్తును కొనసాగిస్తోందని ఆయన వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యాపారి, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ అయిన మెహుల్ చోక్సీ ఆంటిగువా పౌరసత్వం పొందడంపై ఆయనకు, ఆంటిగువా అధికారులకు నోటీసులు ఇచ్చే అంశాన్ని కూడా సెబీ పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. పోలీసులు, పాస్‌పోర్ట్ కార్యాలయం, సెబీ సహా భారత అధికారుల నుంచి ఎలాంటి ప్రతికూల నివేదిక లేనందువల్లనే చోక్సీకి గత సంవత్సరం ఆంటిగువా పౌరసత్వం ఇచ్చినట్టు ఆంటిగువాకు చెందిన ‘సిటిజెన్‌షిప్ బై ఇనె్వస్ట్‌మెంట్ యూనిట్’ (సీఐయూ)ను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా గత వారం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సీఐయూ అధికారులకు కాని మరెవరికి కాని సెబీ.. చోక్సీకి సంబంధించి ఎలాంటి క్లీన్‌చిట్ నివేదిక ఇవ్వలేదని ఆ సీనియర్ అధికారి శనివారం వివరించారు.