బిజినెస్

కార్పొరేట్ల ఆదాయాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: మహీంద్ర అండ్ మహీంద్ర (ఎంఅండ్‌ఎం), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటి బ్లూచిప్ సంస్థల తొలి త్రైమాసిక ఆదాయాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల లావాదేవీల గమనాన్ని నిర్దేశించనున్నాయని నిపుణులు అంచనా వేశారు. ఎంఅండ్‌ఎం, పీఎన్‌బీ తొలి త్రైమాసిక ఫలితాలు వచ్చే వారం వెలువడనున్నాయి. ‘ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ మధ్య సమతుల్యత సాధించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) క్రమంగా చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగిన అంశం. మరోవైపు, అధిక సరఫరాల అంచనాలతో ముడి చమురు ధరలు నియంత్రణలో ఉండటం, తొలి త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల మెరుగయిన ఆదాయాలు ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో ఉన్న సానుకూల ధోరణిని ముందుకు తీసుకెళ్తాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. ‘కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాల వెల్లడి కొనసాగుతున్నందున ఈ వారంలాగే వచ్చే వారం కూడా మార్కెట్లలో లావాదేవీలు క్రియాశీలకంగా సాగుతాయి. ఎంపిక చేసిన షేర్లను కొనుగోలు చేసే తీరు చోటు చేసుకుంటుంది’ అని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ పేర్కొన్నారు. అదాని పోర్ట్స్, అదాని పవర్, సిల్, ఎంఅండ్‌ఎం, పీఎన్‌బీ, బీపీసీఎల్, సిప్లా, లుపిన్, గెయిల్, హిండాల్కో, ఎన్‌హెచ్‌పీసీ వంటి దిగ్గజ సంస్థలు వచ్చే వారం తమ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.
రుతుపవనాల కదలికల అంచనాలు కూడా స్టాక్ మార్కెట్ ధోరణిని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రుతుపవనాల ప్రభావం వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా సూచించిన ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకుంటుందనే అంచనాలు వెలువడ్డాయి. ‘అంతర్జాతీయంగా వాణిజ్య వివాదాల ఉద్రిక్తతలు తీవ్రం కావడం వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లకు మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. అమెరికా ఫెడ్ నుంచి అందిన వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఆసియా మార్కెట్లకు ప్రతికూలతను కొంతవరకు పెంచుతాయి’ అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 219.31 పాయింట్లు (0.59 శాతం) పుంజుకొని, 37,556.16 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు మరింత ఉద్రిక్తం కావడం, కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల బీఎస్‌ఈలో బుధ, గురువారాలలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమయింది.