బిజినెస్

ఇకపై మార్కెట్‌లోకి థర్మల్ బ్యాటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 5: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇంధన విప్లవం కొనసాగుతున్న తరుణంలో వివిధ దేశాలు పర్యావరణ హిత మార్గాలను అనే్వషిస్తున్నాయి. ఉత్పాదనకు తగ్గట్టుగా వినియోగం పెరుగుతోంది. థర్మల్, హైడల్, సౌర, పవన్ విద్యుదుత్పాదన ప్రాజెక్టులతో పాటు అవసరాలు అధికమవుతున్నాయి. ఇంధన వినియోగంలో మన దేశం ప్రపంచంలో తృతీయ స్థానంలో ఉంది. దీంతో ఇంధన పొదుపుపై ఓ ఉద్యమంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇంధన వినియోగం ప్రతి ఏటా 4.2 శాతం మేర పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన వనరులు పరిమితులకు లోబడి అందుబాటులో ఉన్నాయి. వాతావరణ సమశీతోష్ణ స్థితిలో మార్పులు, చేర్పులు జరిగి పర్యావరణ కాలుష్యంతో మానవాళి మనుగడకు ముప్పు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా థర్మల్ బ్యాటరీ వినియోగంలోకి రానుంది. 2030 నాటికి దేశమంతటా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గట్టుగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం వినియోగించే సామర్థ్యం కలిగిన థర్మల్ బ్యాటరీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా థర్మల్ బ్యాటరీల ఉత్పత్తి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ (బెస్ట్) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ తరహా బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది. మొదటి దశలో వెయ్యి మెగావాట్ల బ్యాటరీలను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్‌లోకి విడుదల కానున్న ఈ థర్మల్ బ్యాటరీని సమాచార, సాంకేతిక, రవాణా వ్యవస్థల్లో వినియోగించే వీలు ఏర్పడింది. టెలికాం రంగంతో పాటు మైక్రోగ్రిడ్, ఎలక్ట్రిక్ బస్సులకు కూడా బ్యాటరీ ఉపకరిస్తుంది. 2025 నాటికి 10 జిగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీల ఉత్పాదన లక్ష్యంగా ఎంచుకుంది. డాక్టర్ ప్యాట్రిక్ గ్లిన్ నేతృత్వంలో వెలువడిన ఈ అధునాతన బ్యాటరీకి 2016లోనే మన దేశానికి పేటెంట్ హక్కులు లభించాయి. సాధారణ సామర్థ్యం వెయ్యి మెగావాట్ల బ్యాటరీని ఒక్కసారి రీచార్జి చేస్తే 800 కిలోమీటర్ల మేర వాహనాలు ప్రయాణించే వీలు కలుగుతుంది. గ్రిడ్‌ల సమతుల్యత, ఎలక్ట్రిక్ బస్సులు, టెలీకాం సెల్‌టవర్లు, రైల్వేలు, షిప్పింగ్, డిఫెన్స్, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఈ థర్మల్ బ్యాటరీలు ఉపకరిస్తాయి. సుమారు రూ. 660కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ప్లాంట్ ద్వారా మూడేళ్లలో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ బ్యాటరీలలో వినియోగించే ముడిపదార్థాలు 95శాతం తిరిగి వినియోగించే విధంగా రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌తో పాటు ఈ థర్మల్ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.