బిజినెస్

విశాఖ నుంచి తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ కారణంగా విద్యుత్ వాహనాల తయారీ, వినియోగం గణనీయంగా పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ మొబిలిటీ పాలసీపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పైలట్ ప్రాజెక్టుగా విశాఖలో ఈ వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంచి, తద్వారా కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు వీలుగా ఎలక్ట్రిసిటీ మొబిలిటీ పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. దాదాపు 30వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రంగంలో రాష్ట్రానికి వచ్చేలా విధానాన్ని రూపొందించింది. ఇప్పటికే జపాన్ సంస్థ టోయోటో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఏపీతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు భారీగా రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్టీ, రోడ్డు పన్ను మినహాయింపు, తొలి రెండు కార్ల కంపెనీలకు 10శాతం మేర మూలధన పెట్టుబడుల్లో రాయితీ వంటివి ప్రకటించింది. మరికొన్ని సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో లక్ష విద్యుత్ వాహనాలను రోడ్లపై తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ సంస్థ (ఈఈఎస్‌ఎల్)తో 10వేల కార్ల సరఫరాకు 1100 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది. అమరావతి, తిరుమల, విశాఖలో ఈ వాహనాలను తొలిదశలో వినియోగించనున్నారు. విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెంచేందుకు వీలుగా తొలుత ఈ వాహనాలను ప్రభుత్వం వినియోగించనుంది. ఇప్పటికే వినియోగిస్తున్న వివిధ ప్రభుత్వ వాహనాల స్థానే విద్యుత్ వాహనాలను వినియోగిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా విశాఖను ఎంపిక చేశారు. 500 కార్లను ఈ మూడు ప్రాంతాల్లో ముందుగా వినియోగించనున్నారు.
ఈ ఏడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో లాంఛనంగా రెండు కార్లను మార్కెట్‌లోకి సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ యూనిట్లు కూడా చురుగ్గా ఈ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో వాహనానికి నెలకు 20వేల రూపాయల చొప్పున ఈఈఎస్‌ఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.
విద్యుత్ వాహనాల వినియోగం వల్ల కిలోమీటరుకు 89 పైసలు వ్యయం అవుతుంది. సంప్రదాయ ఇంధనాన్ని వినియోగిస్తే 4.4 రూపాయలు ఖర్చు అవుతుంది. విద్యుత్ వాహన వినియోగం వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రభుత్వ వాహనాల అద్దె కింద 3600 కోట్ల రూపాయలు, ఇంధన చార్జీల కింద 2160 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వాహనాలను గణనీయంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాలకు అవసరమైన విద్యుత్‌ను యూనిట్ 6.15 రూపాయల చొప్పున సరఫరా చేసేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో 50 చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. విద్యుత్ మొబిలిటీ పార్క్‌లు, విద్యుత్ వాహనాల ఏర్పాటుకు పానసోనిక్, తదితర సంస్థలు సంప్రదింపులు ప్రారంభించాయి. విద్యుత్ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇటీవల సిమ్లాలో జరిగిన వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో ఏపీ అమలు చేస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకోవడం గమనార్హం. విద్యుత్ వాహనాల వినియోగంపై గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర కూడా కసరత్తు చేస్తున్నప్పటికీ ఏపీ ముందంజలో దూసుకుపోతోంది.