బిజినెస్

అలంబిక్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఫార్మాస్యూటికల్ రంగంలో అగ్రగామిగా ఉన్న అలంబిక్ సంస్థ తన వ్యాపార శ్రేణిని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అమెరికాలో కంటికి సంబంధించిన మందు సొల్యూషన్‌ను మార్కెట్ చేసేందుకు ఈ సంస్థ చేసుకున్న విజ్ఞప్తికి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తాత్కాలికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సొల్యూషన్‌పై మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మార్కెట్‌కు అనుమతిస్తారు. ఇప్పటికే న్యూజెర్సీ కోర్టులో కేసు ఉందని, అక్కడి నుంచి వచ్చే తీర్పుపైన కూడా కంటి జబ్బుల నివారణకు ఉపయోగించే సొల్యూషన్‌ను మార్కెట్ చేసే విషయం ఆధారపడి ఉంటుందని అలంబిక్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.