బిజినెస్

ఫార్మా ఎగుమతుల వృద్ధి మూడు శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత్ ఫార్మాస్యూటికల్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం నామమాత్రంగా మూడు శాతం పెరిగి, 17.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పెరగడంతో పాటు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒత్తిడి పెరగడం వల్ల ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన స్థాయిలో పెరగలేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ఎగుమతులు అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16.7 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2015-16లో 16.9 బిలియన్ డాలర్ల విలువ గల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆహార, ఔషధ ఉత్పత్తులపై ఆంక్షలను కఠినతరం చేయడంతో పాటు కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు కూడా భారతదేశ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి రేటు మందగించడానికి కారణమని ఆ పరిశ్రమకు చెందిన నిపుణులు పేర్కొన్నారు. భారత ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా అమెరికాకే అవుతుంటాయి. తరువాత స్థానంలో బ్రిటన్ నిలుస్తుంది. మన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లో 25 శాతం ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్, జర్మనీ దేశాలకు కూడా మన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.