బిజినెస్

పెరుగుతున్న జీఎస్‌టీ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: జీఎస్‌టీ ఆదాయం పెరిగే కొద్దీ ఎక్కువ వస్తువులపై వస్తు సేవా పన్నును తగ్గించేందుకు వీలవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే వర్తకుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఆయన ఇక్కడ లోక్‌సభలో జీఎస్‌టీ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ నాలుగు బిల్లులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ, జీఎస్‌టీ నష్టపరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్‌టీకి మంచి స్పందన వస్తోందన్నారు. గత జీఎస్‌టీ మండలి సమావేశంలో అనేక వస్తువులపై రేట్లు తగ్గించామన్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని పరోక్ష పన్నుల భారం పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 384 వస్తువులు, 68 సేవల పైన జీఎస్‌టీని తగ్గించామన్నారు. 99 సేవలను జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెపద్పారు. ఐఎంఎఫ్ అంచనాలను మించి ఆర్థికాభివృద్ధి రేటును సాధిస్తామన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారత్‌లో స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సభకు అంతరాయం కలిగించడం మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రభుత్వానికి జీఎస్‌టీని ఎలా అమలు చేయాలో తెలియదన్నారు. తమిళనాడులో దాదాపు 50 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తుచేశారు.