ఆంధ్రప్రదేశ్‌

మూడోవారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం లాభాల్లో ముగిశాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ తొలిసారి 38,000 స్థాయిని అధిగమించింది. మొత్తం మీద ఈ సూచీ ఈ వారంలో 313.07 (0.83 శాతం) పాయింట్లు పుంజుకొని 37,869.23 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ ఈ వారంలో 38,076.23- 37,586.88 పాయింట్ల మధ్య కదలాడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ ఈ వారంలో 68.70 పాయింట్లు (0.60 శాతం) పెరిగి, 11,429.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఈ వారంలో 11,495.20- 11,359.70 పాయింట్ల మధ్య కదలాడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలోకి తగినంతగా పెట్టుబడులు రావడంతో పాటు కార్పొరేట్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో సాధించిన ఆకర్షణీయమయిన లాభాలు ఈ వారంలో మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ప్రపంచ సంకేతాలు ఈ వారంలో మిశ్రమంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో మంచి లాభాలు ఆర్జించడంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ, అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం పట్ల మదుపరులు కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ వారం మార్కెట్లలో లావాదేవీలు సానుకూల ధోరణిలో ప్రారంభం అయ్యాయి. నిలకడగా సాగిన సోమవారం నాటి లావాదేవీలలో సూచీలోని కీలక సంస్థల షేర్లకు కొనుగోలు డిమాండ్ పెరగడం వల్ల దేశీయ మార్కెట్లు మంచి లాభాలు ఆర్జించాయి. సెనె్సక్స్ 135.73 పాయింట్లు (0.36 శాతం) పుంజుకొని, 37,691.89 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 26.30 పాయింట్లు (0.23 శాతం) పెరిగి, 11,387.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. మంగళవారం మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. సెనె్సక్స్ 26.09 పాయింట్లు (0.07 శాతం) పడిపోయి, 37,665.80 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కేవలం 2.35 పాయింట్లు (0.02 శాతం) పెరిగి, 11,389.45 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం మార్కెట్లు తిరిగి బలపడ్డాయి. ఇంట్రా-డేలోనూ, ముగింపులోనూ కీలక సూచీలు కొత్త గరిష్ఠ స్థాయి రికార్డులు సృష్టించాయి. సెనె్సక్స్ 221.76 పాయింట్లు (0.59 శాతం) పుంజుకొని, 37,887.56 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 60.55 పాయింట్లు (0.53 శాతం) పెరిగి, 11,450 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు కీలక సూచీలు గురువారం తిరిగి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. కొన్ని బ్యాంకింగ్ షేర్లలో వచ్చిన ర్యాలీ వల్ల సెనె్సక్స్ తొలిసారి మానసికంగా కీలకమయిన 38వేల స్థాయికి పైన ముగిసింది. ఈ సూచీ 136.81 పాయింట్లు (0.36 శాతం) పుంజుకొని 38,024.37 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 20.70 పాయింట్లు (0.18 శాతం) పెరిగి, 11,470.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయితే, ఈ రెండు కీలక సూచీలు శుక్రవారం నష్టపోయాయి. సెనె్సక్స్ 155.14 పాయింట్లు (0.41 శాతం) పడిపోయి, 37,869.23 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 41.20 పాయింట్లు (0.36 శాతం) తగ్గి, 11,429.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ గత వారంలో 1,059.79 పాయింట్లు (2.89 శాతం) పుంజుకుంది.
కన్స్యూమర్ డ్యూరేబుల్స్, బ్యాంకింగ్, లోహ, స్థిరాస్తి, టెక్నాలజి, ఐటీ, వాహన, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఈ వారంలో లాభపడ్డాయి. మదుపరుల లాభాల స్వీకరణ కారణంగా ఆరోగ్య సంరక్షణ, ఐపీఓ, క్యాపిటల్ గూడ్స్, చమురు- సహజ వాయువు, పీఎస్‌యూలు, పవర్ రంగాల షేర్లు నష్టపోయాయి.