బిజినెస్

భారీగా రూపాయ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 13: వరుసగా రెండు సెషన్లలో కూడా సెనె్సక్స్ పతన బాటలోనే సాగింది. గత రెండు వారాల్లో ఎన్నడూలేని దిగువకు చేరుకుని 224 పాయింట్లు కోల్పోయి 37,645 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక పక్క రూపాయి విలువ తగ్గడం, టర్కీలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన కారణంగా మదుపుదారులు భారీగా అమ్మకాలకు పాల్పడడంతో దాని ప్రభావం సెనె్సక్స్‌పై భారీగా పడింది. అలాగే నిఫ్టీ కూడా 73.75 పాయింట్లు కోల్పోయి 11,355.75 వద్ద ముగిసింది. అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి విలువ ఎన్నడూ లేని రీతిలో భారీగా తగ్గి 69.85 పైసలకు చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థల షేర్లలోనే భారీగా అమ్మకాలు సోమవారం జరిగిన లావాదేవీల్లో చోటుచేసుకున్నాయి.
అలాగే అమెరికా-టర్కీల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావాన్ని కనబరిచాయి. భారతీయ స్టాక్ మార్కెట్లపైన ఈ సంక్షోభ తీవ్రత ప్రస్ఫుటించడంతో అమ్మకాలు పెరిగి ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీ పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి రేటు 7 శాతం ఉండవచ్చునన్న అంచనాలు వచ్చినప్పటికీ అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు తలెత్తడం, రూపాయి మారక విలువ తగ్గడంతో ఇనె్వస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. కాగా, జూన్ క్వార్టర్ వరకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ షేరు అత్యధికంగా 3.17 శాతం తగ్గింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ బ్యాంక్‌ల షేర్లు 3.37 శాతం వరకు తగ్గాయి. ఆర్‌ఐఎల్ 1.40 శాతం, ఆసియన్ పెయింట్స్ 1.39 శాతం, టాటా స్టీల్ 1.10 శాతం, ఎన్టీపీసీ 1.28 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.15 శాతం, హెచ్‌యూఎల్ 0.90 శాతం, ఐసీఐసీ బ్యాంక్ 0.88 శాతం, టాటా మోటార్స్ 0.68 శాతం, మారుతీ సుజుకీ 0.67 శాతం, హీరో మోటోకార్ప్స్ 0.48 శాతం, ఆదానీ పోర్ట్స్ 0.29 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.14 శాతం షేరుల భారీ నష్టాన్ని మూటకట్టుకున్నాయ. టెక్ మహీంద్ర, కోల్ ఇండియా, గెయల్, సన్‌ఫార్మా, రెడ్డీస్ లేబోరేటరీ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయ.