బిజినెస్

కెమికల్, పెట్రో కెమికల్ పరిశ్రమలకు తూర్పు తీరం అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కెమికల్, పెట్రోకెమికల్ పరిశ్రమలు ప్రస్తుతం పశ్చిమ తీరంలోనే అత్యధికంగా ఏర్పాటయ్యాయని తూర్పు తీరం కూడా ఈ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమేననిన కేంద్ర కెమికల్, పెట్రోకెమికల్ విభాగం కార్యదర్శి పీ రాఘవేంద్ర రావు అన్నారు. ఇండియా కెమ్-2018పై ఫిక్కీ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పశ్చిమ తీరంలో ఈ పరిశ్రమ విస్తృత స్థాయిలో వేళ్లూనుకుందన్నారు. పోర్టులు, ఇతర రవాణా అనుసంధానం కలిగిన తూర్పు తీరంలో కూడా ఈ రంగం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కెమికల్, పెట్రోకెమికల్ మూల పదార్ధాలుగా ఉత్పత్తి చేసే వస్తువులు మానవాళి మనుగడలో భాగమైపోయాయన్నారు.
అంతర్జాతీయంగా 2015లో ఈ రంగంలో జరిగిన వాణిజ్యం 4,300 బిలియన్ డాలర్లు కాగా, భారత్ వాటా కేవలం 150 బిలియన్ డాలర్లు మాత్రమే, ఇది 3 శాతం వాటామాత్రమేనన్నారు. భారత్‌లో ఆగ్రోకెమికల్ ఎగుమతులు 50 శాతం కాగా, డైయింగ్ వంటి ఉత్పత్తుల ఎగుమతులు 75 శాతమన్నారు. కెమికల్ ఉత్పత్తుల దిగుమతుల్లో భారత్ రూ.2.63 లక్షల కోట్లతో 6వ స్థానంలో ఉండగా ఎగుమతుల్లో రూ.1.91 లక్షల కోట్లతో 17వ స్థానంలో ఉందన్నారు. భారత్‌లో ప్లాస్టిక్ తలసరి వినియోగం కేవలం 10 కిలోలు కాగా, జర్మనీ వంటి దేశాల్లో 108 కిలోలుగా ఉందన్నారు.
ఇండియా కెమ్-2018
భారత్‌లో కెమికల్, పెట్రోకెమికల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అనువుగా ఇండియా కెమ్-2018 ప్రదర్శన, సదస్సును భారత్‌లో నిర్వహిస్తున్నట్టు రాఘవేంద్రరావు తెలిపారు. ముంబై కేంద్రంగా అక్టోబర్ 4-6 తేదీల్లో ఇండియా కెమ్-2018 జరుగుతుందన్నారు. కెమికల్, పెట్రో కెమికల్ రంగంలో వస్తున్న విస్తృత మార్పులకు అనుగుణంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రెండేళ్లకోసారి ప్రదర్శన, సదస్సు జరుగుతుందన్నారు. తొలి సారిగా భారత్ ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తోందని, ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారని పేర్కొన్నారు.