బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రెండు రోజుల నష్టాలకు తెరదించుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి బలపడ్డాయి. ప్రధానంగా ఫైనాన్సియల్, హెల్త్‌కేర్, ఐటీ రంగాల షేర్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి. జూలై నెలలో ద్రవ్యోల్బణం తగ్గడం, డాలర్‌తో పోలిస్తే టర్కీ కరెన్సీ లీరా కొంతవరకు కోలుకోవడం మదుపరులలో విశ్వాసాన్ని పాదుగొలిపింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 207 పాయింట్లు పుంజుకొని 37,852 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మానసికంగా కీలకమయిన 11,400 స్థాయికి పైన ముగిసింది. అయితే, ఈక్విటీల ధోరణికి భిన్నంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో మొదటిసారి మంగళవారం ఇంట్రా-డేలో 70ని దాటి, 70.09కు చేరింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావంతో రూపాయి విలువ పడిపోయింది.
టర్కీ సెంట్రల్ బ్యాంక్ జోక్యం చేసుకోవడం వల్ల డాలర్‌తో పోలిస్తే తొలి లావాదేవీలలో కనిష్ట స్థాయికి పడిపోయిన లీరా విలువ తిరిగి పుంజుకుంది. జూన్‌లో 5.77 శాతం ఉన్న టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఆహార వస్తువుల ధరలు తగ్గడం వల్ల జూలైలో 5.09 శాతానికి తగ్గింది. వినియోగ వస్తువుల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం కూడా జూలైలో తొమ్మిది నెలల కనిష్ట స్థాయి అయిన 4.17కు పడిపోయింది. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నిరాటంకంగా కొనుగోళ్లు జరపడం, కొన్ని బ్లూచిప్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో ఆకర్షణీయమయిన లాభాలను గడించడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.
ఆసియా మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ ధోరణి, ఐరోపా స్టాక్ మార్కెట్లు అధిక స్థాయిల వద్ద ప్రారంభం కావడం వంటి అంశాలూ దేశీయ మార్కెట్లు బలపడటానికి దోహదపడింది. మంగళవారం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత మరింత పైకి ఎగబాకుతూ ఒక దశలో 37,932.40 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
క్రితం ముగింపుతో పోలిస్తే 207.10 పాయింట్ల (0.55 శాతం) ఎగువన 37,852 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా మంగళవారం ఇంట్రా- డేలో 11,452.45 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 79.35 పాయింట్ల (0.70 శాతం) ఎగువన 11,435.10 పా యింట్ల వద్ద ముగిసింది. డీఐఐలు సోమవారం నికరంగా రూ. 216.29 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 971.86 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థలలో సన్ ఫార్మా అత్యధికంగా 6.91 శాతం లాభపడింది. ఈ కంపెనీ జూన్ త్రైమాసికంలో రూ. 982.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు మంగళవారం ప్రకటించిన ఫలితాలలో వెల్లడి కావడంతో షేర్ విలువ బాగా పెరిగింది.
లాభపడిన ఇతర సంస్థలలో టాటా స్టీల్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిల్, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, విప్రో, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్ ఉన్నాయి.