బిజినెస్

స్మార్ట్ఫోన్ల బ్యాటరీల జీవిత కాలం పొడిగించే యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోరంటో, ఆగస్టు 15: స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ శక్తిని తక్కువగా వినియోగించడంతోబాటు, బ్యాటరీల జీవిత కాలాన్ని పొడిగించేందుకు దోహదం చేసే ఓ ప్రత్యేక యాప్‌ను ఇక్కడి శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఈ శాస్తవ్రేత్తల్లో భారత సంతతికి చెందిన క్షీరసాగర్ నాయక్ కూడా ఒకరు కావడం విశేషం. ఈ యాప్ ద్వారాప్రతిరోజూ స్మార్ట్ఫోన్ బ్యాటరీ కనీసం గంటకుపైగా అదనంగా పనిచేస్తుంది. రెండు వందలమంది స్మార్ట్ వినియోగదారులు తమ ఫోన్లలోని విండోస్‌లోకి సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ యాప్‌పై పరిశోధనలకు దోహదం చేశారు. వీరి స్మార్ట్ఫోన్ల బ్యాటరీలు 10 నుంచి 25 శాతం అదనపు సామర్ధ్యంతో పనిచేయడం ఈ సందర్భంగా కనుగొన్నారు. ఈ బిల్ట్ ఇన్ మల్టీవిండో ఫీచర్‌ను న్యూ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా అనుసంధానించడం వల్ల ఒక ల్యాప్‌టాప్‌లో ఒకేసారి అనేక విండోస్‌ను, ఫైళ్లను ఓపెన్ చేసుకునే వీలు కలుగుతుందని, అయితే ఇది బ్యాటరీ శక్తిని అనవసరంగా వినియోగించడం అవుతుందని కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్షీరసాగర్ నాయక్ తెలిపారు. ఈయన కూడా ఈ ప్రత్యేక యాప్ రూపకర్తల్లో ఒకరు.
ఫోన్‌లోని నాన్ క్రిటికల్ అప్లికేషన్స్‌లో వెలుగును తగ్గించేందుకే ప్రధానంగా తాము ఈ యాప్‌ను రూపొందంచామని ఆయన చెప్పారు. ఇలా చేయడం వల్ల ఇతర విండోలకూ బ్యాటరీ వినియోగం తగ్గుతుందని ఆయన చెప్పారు. రాత్రంగా చార్జింగ్‌లో పెట్టేయడం వల్ల ఫోన్‌లోని అన్ని విభాగాలూ ఆక్టివేట్ అయి బ్యాటరీ మామూలుకన్నా అధికంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇలా వరుసగా చేయడం వల్ల మూడేళ్లు పనిచేసే బ్యాటరీలు సైతం రెండేళ్లకే మూలనపడుతున్నాయని ఫ్రొఫెసర్ క్షీరసాగర్ నాయక్ తెలిపారు.