బిజినెస్

బ్యాంకుల పెద్ద ఖాతాల ఆడిట్‌కు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: నానాటికీ పెరుగుతున్న బ్యాంకుల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల) విలువను తగ్గించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన బ్యాంకుల అకౌంట్లను ఆడిట్ చేయనుంది. దాదాపు 200కు పైగా పెద్ద అకౌంట్ల లావాదేవీలను నిశితంగా పరిశీలించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీని వల్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువను తగ్గించేందుకు వీలవుతుంది. బ్యాంకులు రెండు వందల పెద్ద అకౌంట్లను ప్రమాణాలకు లోబడి ఆడిట్ చేసిందా లేదా అనే విషయాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తుంది. ప్రతి ఏడాది ఆర్‌బీఐ కొన్ని అకౌంట్లను ఎంపిక చేసి ఆడిట్ చేస్తుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ అకౌంట్లలో ఆర్థిక లావాదేవీలు, రుణాలు, చెల్లింపును మదింపు చేస్తారు. వీడియోకాన్,జిందాల్ స్టీల్, విద్యుత్ రంగానికి చెందిన అకౌంట్లను తనిఖీ చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలోని బ్యాంకు అకౌంట్ల నిరర్థక ఆస్తుల విలువ 10.3 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఎన్‌పీఏల విలువ 8.5 లక్షల కోట్లు ఉండేది. ఆర్‌బీఐ తనిఖీల్లో యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని లోటుపాట్లు బయటపడ్డాయి. ఎన్‌పీఏల వల్ల ప్రైవేట్ బ్యాంకులు కూడా గత ఏడాది దెబ్బతిన్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఎన్‌పీఏలను తగ్గించి చూపాయి. యస్ బ్యాంకు రూ.11వేల కోట్లు తక్కువగా ఎన్‌పీఏ విలువను తగ్గించి చూపించనట్లు ఆర్‌బీఐ నివేదికలో వెల్లడించాయి. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా ఈ తరహా పనులకు పాల్పడినట్లు ఆర్‌బీఐ గతంలో పేర్కొంది.