బిజినెస్

పెద్ద సంస్థలకే లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: భారత స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతున్నప్పటికీ దానివల్ల బాగా లాభపడుతున్నది మార్కెట్ విలువ ఎక్కువగా గల పెద్ద కంపెనీలే. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేక పోయాయి.
ఒకవైపు పెద్ద కంపెనీలతో కూడిన బీఎస్‌ఈ సెనె్సక్స్ బాగా పుంజుకోగా, మరోవైపు మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1,580.74 పాయింట్లు (8.86 శాతం) పడిపోయింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ పతనం మరింత తీవ్రంగా ఉంది. ఈ సూచీ ఈ ఏడాది ఇప్పటి వరకు 2,488.03 పాయింట్లు (12.93 శాతం) పడిపోయింది. బీఎస్‌ఈలోని సూచీల పనితీరుపై చేసిన విశే్లషణ ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు, 30 బ్లూచిప్ కంపెనీల షేర్లతో కూడిన బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3,795.17 పాయింట్లు (11.14 శాతం) పుంజుకుంది. సెనె్సక్స్ ఈ నెల 9వ తేదీన జీవితకాల గరిష్ఠ స్థాయి అయిన 38,076.23 పాయింట్లకు చేరింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ జనవరి 15వ తేదీన ఆల్ టైమ్ హై 20,183.45 పాయింట్లను తాకింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ జనవరి 9వ తేదీన రికార్డు గరిష్ఠ స్థాయి 18,321.37 పాయింట్లను చేరింది. సాధారణంగా దేశీయ మదుపరులు మాత్రమే చిన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తుంటారని, విదేశీ మదుపరులు బ్లూచిప్ కంపెనీలపై దృష్టి కేంద్రీకరిస్తారని మార్కెట్ పరిశీలకులు పేర్కొన్నారు. 2017వ సంవత్సరంలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 59.64 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 48.13 శాతం చొప్పున పుంజుకున్నాయి.
మరోవైపు, సెనె్సక్స్ 27.91 శాతం మాత్రమే పెరిగింది. స్టాక్ మార్కెట్ లావాదేవీలలో అనిశ్చితి చోటు చేసుకున్నప్పుడు చిన్న కంపెనీల షేర్లే ఎక్కువగా నష్టపోతుంటాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.