బిజినెస్

ఎలాంటి అనిశ్చితినైనా ఎదుర్కోగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అనుచిత ఒడిదుడుకులు తలెత్తినప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి భారత్ తగినన్ని విదేశీ మారకద్రవ్య నిల్వలను కలిగి ఉన్నదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కరెన్సీ మార్కెట్ పరిణామాలను జాగ్రత్తగా గమనించడం జరుగుతోందని కూడా ఆయన బుధవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పలు సందేశాలలో పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం చరిత్రలో మొదటిసారి 70 స్థాయిని దాటి క్షీణించిన నేపథ్యంలో అరుణ్ జైట్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టర్కీ కరెన్సీ లీరా సంక్షోభం ఫలితంగా రూపాయి విలువ మంగళవారం డాలర్‌తో పోలిస్తే జీవనకాల గరిష్ఠ స్థాయి 70.09కి పడిపోయింది. లీరా సంక్షోభం రూపాయినే కాకుండా అభివృద్ధి చెందుతున్న మిగతా దేశాల కరెన్సీలనూ ప్రభావితం చేసింది. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలర్ బలపడింది. టర్కీకి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలకు ముప్పుగా పరిణమించాయని జైట్లీ పేర్కొన్నారు. అయితే, భారత్ స్థూలార్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. జైట్లీ మే 14న కిడ్నీ మార్పిడి శస్తచ్రికిత్సకు వెళ్లక ముందు వరకు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను నిర్వహించారు. జైట్లీ చికిత్సకు వెళ్లడంతో ఆయన చూస్తూ వచ్చిన ఈ రెండు శాఖలను మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. 3విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో తలెత్తే ఎలాంటి అనుచిత అనిశ్చితినయినా ఎదుర్కోవడానికి భారత్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తగినన్ని విదేశీ మారకద్రవ్య నిల్వలను కలిగి ఉంది2 అని జైట్లీ ట్వీట్ చేశారు. అస్థిరమయిన అంతర్జాతీయ వాతావరణం కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితులనయినా ఎదుర్కోవడానికి కరెన్సీ మార్కెట్‌లో పరిణామాలను జాగ్రత్తగా గమనించడం జరుగుతోందని జైట్లీ వివరించారు. ఆగస్టు మూడో తేదీతో ముగిసిన వారంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు 402.70 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతకన్నా ముందు వారంతో పోలిస్తే ఇవి 1.49 బిలియన్ డాలర్లు తక్కువ.
ఆర్‌బీఐ తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏప్రిల్ ఒకటో తేదీతో మొదలయిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 6.7 శాతం తగ్గింది.