బిజినెస్

కాస్మొస్ బ్యాంక్‌లో సైబర్ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఆగస్టు 16: కాస్మొస్ బ్యాంక్‌లో చోటు చేసుకున్న భారీ సైబర్ మోసంపై విచారణకు ప్రత్యేక బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్టు పుణే పోలీస్ అధికారులు ప్రకటించారు. బ్యాంక్ మాల్‌వేర్‌ను హ్యాక్ చేసి, కేవలం రెండు రోజుల్లోనే 94 కోట్ల రూపాయలను కాజేసిన వైనం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిర్యాదు అందుకొని రంగంలోకి దిగిన పోలీస్‌లు ఇది సైబర్ నేరం కావడంతో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో జరిగిన వివిధ లావాదేవీలపై దృష్టి సారిస్తున్నారు. ప్రత్యేకించి, స్థానికంగా ఏటీఎంల ద్వారా 2.5 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసినట్టు అందిన సమాచారంతో, ఎవరెవరు, ఎంతెంత మొత్తం డ్రా చేసుకున్నారనే సమాచారాన్ని రాబడుతున్నామని సైబర్, ఆర్థిక నేరాల విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జ్యోతిప్రియ సింగ్ తెలిపారు. సిట్ ఏర్పాటైందని, లోతుగా దర్యాప్తు చేయడం ద్వారా దోషులను గుర్తించడం సాధ్యమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఒక ఏటీఎం నుంచి గతంలోఎన్నడూ లేనంతగా మొత్తాలు విడ్‌డ్రా కావడాన్ని గుర్తించిన కాస్పొస్ బ్యాంక్ సిబ్బంది దీనిపై దృష్టి పెట్టారు. అంతర్గత ఆడిట్‌లో భారీగా సొమ్ము గల్లంతైన విషయాన్ని తెలుసుకొని, పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఇలావుంటే, ప్రపంచ వ్యాప్తంగా 28 దేశాల్లో 15,000 లావాదేవీలు జరిగాయాని, వీటిలో కొన్ని నిజమైనవి కావచ్చని, అయితే, ఎక్కువ శాతం మాత్రం పోసపూరితమని అనుమానిస్తున్నామని బ్యాంక్ సిబ్బంది తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, మాల్‌వేర్‌పై దాడి చేసి, సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలను సైబర్ నేరగాళ్లు అపహరించారని కాస్మొస్ బ్యాంక్ చైర్మన్ మిలింద్ కాలే పీటీఐకి తెలిపారు. విదేశాల్లోనూ సొమ్మును విత్‌డ్రా చేసినట్టు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీస్‌లను ఆశ్రయించామని అన్నారు. ఇదిలావుంటే, కాస్మొస్ సైబర్ దాడి వెనుక కొరియా హ్యాకర్ల హస్తం ఉందని పోలీస్‌లు, నిపుణులు అనుమానిస్తున్నారు. అందుకే, ఇటీవల కాలంలో జరిగిన లావాదేవీలను సిట్‌తో దర్యాప్తు చేయించి, డబ్బు ఎక్కడ, ఏ రూపంలో మాయమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.