బిజినెస్

మళ్లీ పెరిగిన డీజిల్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం నాలుగు మెట్రో నగరాలలో డీజిల్ ధరలను పెంచాయి. అయితే పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గురువారం ఈ రెండింటి ధరలు పెరిగాయి. పెరిగిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.20, ముంబయిలో రూ. 84.63, కోల్‌కతాలో రూ. 80.14, చెన్నయ్‌లో రూ. 80.19గా ఉంది. పెట్రోల్ ధరలు ఢిల్లీలో తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అమ్మకపు పన్ను లేదా వ్యాట్ తక్కువగా ఉంటుంది. ఢిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్ 27 శాతం మాత్రమే ఉంది. ముంబయిలో అత్యధికంగా 39.12 శాతం ఉంది. పెరిగిన రేట్ల ప్రకారం లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 68.86, ముంబయిలో రూ. 73.10, కోల్‌కతాలో రూ. 71.70, చెన్నయ్‌లో రూ. 72.74లుగా ఉంది. డీజిల్ ధర కూడా ఢిల్లీలోనే తక్కువ. ఢిల్లీలో డీజిల్‌పై 17.24 శాతమే వ్యాట్ విధిస్తారు.