బిజినెస్

దివాలా ప్రక్రియ చట్టానికి త్వరలో సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 18: దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల విలువను మదింపు వేసేందుకు రిజిస్టర్డ్ వాల్యూవర్స్ (విలువ నిపుణులు) కోసం ప్రత్యేక చట్టాన్ని తెచ్చే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. గత ఏడాది జూలై నుంచి నేషనల్ కంపెనీ లా బోర్డుకు ఎక్కువ నిరర్థక ఆస్తుల విలువ ఉన్న 40 కంపెనీలను రెఫర్ చేశారు. ఈ కంపెనీలకు రూ.1 లక్ష కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. ఇందులో ఏడు కంపెనీలకు పరిష్కారం లభించింది. దివాలా ప్రక్రియలో ఆస్తుల మదింపుదార్లు ఉండాలి. వీటికి వెలకట్టాలి. కానీ చట్టంలో వీరికి సంబంధించిన ప్రస్తావన లేదు. త్వరలో ఈ చట్టానికి మార్పులు చేసి విలువను గట్టే నిపుణులను కూడా దివాలా ప్రక్రియ పరిధిలోకి తెస్తామని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. చాలామంది ఇన్‌సాల్వెన్సీ నిపుణులకు ఆస్తుల మదింపు గురించి తెలియదు. ఇప్పుడు రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఉన్నారు. కానీ వీరి పర్యవేక్షణకు సంబంధించి చట్టం లేదు. కంపెనీ సెక్రటరీలు, చార్టెర్డ్ అకౌంటెంట్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని చెప్పారు. సీఐఐ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లు ఉన్నారు. వీరు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కానీ ఇన్‌సాల్వెన్సీ నిపుణులు పెద్దగా లేరు. ఉన్నా వీరికి అనుభవం అంతంత మాత్రమే అని ఆయన చెప్పారు. దివాలా ప్రక్రియలో వాల్యూయర్స్ పాత్ర కీలమైనదన్నారు. దివాలా ప్రక్రియ సంక్లిష్టమైనదని, ఇందులో అనేక మంది వాటాదారులు ఉంటారన్నారు. దివాలా ప్రక్రియ పూర్తి నిర్ణీత కాలపరిమితి ఉండాలన్నారు. ప్రమోటర్లు తమ బకాయిలను చెల్లిస్తే మళ్లీ యాజమాన్యాన్ని వారికే అప్పచెప్పేందుకు వీలుగా గత ఏడాది చట్టాన్ని సవరించినట్లు చెప్పారు. ఐబీసీ చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ ఇంతవరకు ఆస్తుల మదింపునకు సంబంధించి విలువ కట్టే ఎనిమిది సంస్థలు తమ వద్ద నమోదు చేసుకుని ఉన్నాయని చెప్పారు.