బిజినెస్

రూపాయి కోలుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 18: డాలర్‌తో పోలిస్తే ఇటీవల బాగా దెబ్బతిన్న రూపాయి కోలుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ఈ నెలలో భారత మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల రాక సానుకూలంగా ఉండటం వల్ల అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68-69 వద్ద స్థిరపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసియా దేశాల కరెన్సీలు అన్నింటికన్నా రూపాయి తీవ్రంగా దెబ్బతిని, మంగళవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 70.09 వద్దకు దిగజారింది. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శనివారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో గార్గ్ మాట్లాడుతూ అమెరికా విధించిన ఆంక్షల వల్లనే ప్రస్తుతం టర్కీలో సంక్షోభం తలెత్తిందని గార్గ్ అభిప్రాయపడ్డారు. భారత మార్కెట్లలోకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్ల (ఎఫ్‌పీఐల) పెట్టుబడుల రాకలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని, అలాగే జూలై నెలలో మన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదని ఆయన వివరించారు. మొదటి మూడు నెలలు మాత్రమే ఇక్కడి నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెళ్లిపోయాయని చెప్పారు. గత సంవత్సరం ఇక్కడి నుంచి 20 బిలియన్ డాలర్ల ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెళ్లిపోయాయని ఆయన వెల్లడించారు. ‘ముడి చమురు ధరలు మరింత పెరగకుంటే, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68-69 వద్ద స్థిరపడటానికి అవకాశాలు ఉన్నాయి’ అని గార్గ్ అన్నారు. చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే, దాని ప్రభావం రూపాయిపై ఎలా ఉంటుంది? అని ప్రశ్నించగా, గత 20 ఏళ్లలో తొలిసారి చైనా ఆర్థిక వ్యవస్థలో కరెంటు ఖాతా లోటు (సీఏడీ) ఏర్పడిందని ఆయన అన్నారు. ‘ప్రస్తుతం చైనా ఎగుమతులు, దిగుమతులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు చూస్తే చైనా కరెన్సీ యువాన్ మారకం విలువ తగ్గుదల మరీ ఎక్కువగా ఏమీ లేదు. చైనా కరెన్సీ విలువ తగ్గినప్పటికీ, డాలర్‌తో పోలిస్తే మిగతా కరెన్సీల విలువ తగ్గుదల అదేవిధంగా ఉన్నంత కాలం భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని గార్గ్ బదులిచ్చారు.