బిజినెస్

కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్ ఏర్పాటుకు బిఎస్‌ఇ యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: మెటల్స్ రంగంలో ట్రేడింగ్‌కు వీలుకల్పించేలా త్వరలో కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతి కోసం మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీని ఆశ్రయించామని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ) శనివారం వెల్లడించింది. ‘బాంబే స్టాక్ ఎక్స్‌చేంజిలో కమోడిటీ డెరివేటివ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. సెబీ నుంచి అనుమతులు లభించిన వెంటనే దీనిని ప్రారంభిస్తాం. మెటల్స్, ఆయిల్, గ్యాస్ వంటి వ్యవసాయేతర కమోడిటీలతో ఇది ఏర్పాటవుతుంది’ అని బిఎస్‌ఇ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. పెట్టుబడుల మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ, కమాడిటీ మార్కెట్ నియంత్రణా సంస్థ ఎఫ్‌ఎంసి (్ఫర్వర్డ్ మార్కెట్ కమిషన్) విలీనం తర్వాత కమోడిటీ ట్రేడింగ్‌ను ప్రారంభించేందుకు స్టాక్ ఎక్స్‌చేంజి సభ్యులు ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ‘సెబీ, ఎఫ్‌ఎంసిల విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత మా సభ్యులు కమోడిటీల్లో ట్రేడింగ్ నిర్వహించుకోగలుగుతారు. కమోడిటీ ఎక్స్‌చేంజిలో సభ్యత్వాన్ని పొందాలంటే ఇంతకుముందు ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అనుమతులను పొందితే బిఎస్‌ఇలోనే మేము ట్రేడింగ్‌ను నిర్వహించేందుకు వీలుకల్పిస్తున్నారు’ అని చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన జాతీయ స్టాక్ ఎక్సేంజిలతో పాటు ఆరు ప్రాంతీయ స్టాక్ ఎక్సేంజిలు కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.