బిజినెస్

వేతన చట్టాలను సరిగ్గా అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: వేతన చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలని భారత్‌కు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) సూచించింది. ఒకే పనికి ఒకే రకమైన వేతనం అనే విధానం భారత్‌లో సక్రమంగా అమలు జరగడం లేదని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఐఎల్‌ఓ స్పష్టం చేసింది. ప్రత్యేకించి మహిళా కార్మికుల పట్ల వివక్ష కొనసాగుతున్నదని పేర్కొంది. గత కొంతకాలంగా స్థూల జాతీయోత్పత్తి సగటున ఏడు శాతం చొప్పున పెరుగుతున్న నేపథ్యంలో పేదరికంలోనూ కొంత తగ్గుదల కనిపిస్తున్నదని తెలిపింది. ఎక్కువ శాతం మంది సేవలు, పరిశ్రమల రంగంలో పని చేస్తున్నారని తెలిపింది. ఇప్పటికీ సుమారు 62 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారని, ఇతరత్రా రంగాల్లో పని చేస్తున్న వారిలో అత్యధిక శాతం మందికి సరైన వేతనాలు లేవని స్పష్టం చేసింది. వివిధ రంగాల్లో పని చేస్తున్న వారిలో సుమారు 47 శాతం మంది వివక్షకు గురవుతున్నారని తెలిపింది. రెగ్యులర్ ఉద్యోగుల పరిస్తితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రం దారుణంగా నష్టపోతున్నారని పేర్కొంది. అదే విధంగా మహిళల శ్రమ దోపిడీ భారత్‌లో ఎక్కువగా ఉందని తేల్చిచెప్పింది. వేతన చట్టం సక్రమంగా అమలు జరిగితే, ఈ పరిస్థితి ఉండదని, ఈ దిశగా భారత్ దృష్టి సారించాలని సూచించింది.