బిజినెస్

సెనె్సక్స్ రికార్డు పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజిలో సెనె్సక్స్ రికార్డు పరుగును కొనసాగిస్తున్నది. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ 11,500 పాయింట్ల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించింది. ఎల్ అండ్ టీ, టాటా మోటర్స్ భారీగా లాభపడ్డాయి. మొత్తం మీద స్టాక్ మార్కెట్ సోమవారం మరింత వేగాన్ని పుంజుకుంది. వరుసగా రెండో రోజు కూడా 330 షేర్ సెనె్సక్స్2 ఈనెల తొమ్మిదిన నమోదైన 38,076.23 పాయింట్ల రికార్డును బద్దలు చేస్తూ 38,279.75 పాయింట్లకు చేరింది. గత వారంతో పోలిస్తే ఈ వారం 284.32 పాయింట్లు పెరగడం గమనార్హం. అదే విధంగా 350 షేర్ నిఫ్టీ2 సైతం దూకుడును కొనసాగించింది. గత రెండు రోజుల మాదిరిగానే బుల్ రన్ సోమవారం కూడా కొనసాగి, ఒకానొక దశలో 11,500 మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ చరిత్రలో 11,565.30 పాయింట్లు నమోదుకావడం ఇదే మొదటిసారి. మదుపరులు ముందుకు రావడంతో, ఇంట్రా ట్రేడ్ ఊపందుకుంది. కాగా, సోమవారం సాయంత్రానికి నిఫ్టీ కొద్దిగా తగ్గి, 11,551.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఈనెల 17న 11,470.75 పాయింట్లతో నమోదైన రికార్డు సోమవారం బద్దలైంది. రూపాయి బలపడడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య పరమైన ప్రచ్ఛన్న యుద్ధం నెలకొనడం వంటి అంశాలు సెనె్సక్స్, నిఫ్టీ పాయింట్లు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డాయి. ఎల్ అండ్ టీ, టాటా మోటర్స్‌తోపాటు ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, వేదాంత, బజాజ్ ఆటో, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సీ, ఎస్‌బీఐ, హీరో మోటార్స్ షేర్లు కూడా లాభాల పంట పండించాయి. ఎస్ బ్యాంక్, కోల్ ఇండియా, విప్రో, హెచ్‌యూఎల్, తదితర కంపెనీలు సైతం లాభాల బాటలో నడిచాయి. అయితే, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, టీసీఎస్ షేర్లు రెండు శాతం పడిపోయాయి.