బిజినెస్

యూకేలోనే నీరవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,000 కోట్లకు మోసం చేసి, విదేశాలకు పారిపోయన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ యూకేలోనే ఉన్నట్టు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సీబీఐ అభ్యర్థనపై స్పందించిన యూకే అధికారులు నీరవ్ మోదీ అక్కడే ఉన్నట్టు పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసగించిన కేసులో నీరవ్‌తోపాటు, అతని భార్య అమీ మోదీ, సోదరుడు నిషాల్ మోదీ, మామ మెహుల్ చోక్సీపైన కూడా సీబీఐ కేసులు నమోదు చేసి, విచారిస్తున్నది. అమీ మోదీకి అమెరికా పౌరసత్వం ఉంది. నిషాల్‌కు బెల్జియం, చోక్సీకి అంటిగువా పౌరసత్వాలు ఉన్నాయి. వీరంతా విచారణ నిమిత్తం భారత్‌కు రావడానికి నిరాకరించడంతో, సీబీఐ ఇంటర్ పోల్‌ను ఆశ్రయించింది. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో నీరవ్, అతని కుటుంబ సభ్యులపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ (ఆర్‌సీఎన్)ను జారీ చేసింది. వీరి జాడ తెలిస్తే సమాచారం ఇవ్వడమేగాక, నిర్బంధంలోకి తీసుకొని, భారత్‌కు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్ పోల్ తన 192 సభ్య దేశాలను కోరింది. జనవరిలో భారత్‌ను విడిచి పారిపోయిన నీరవ్ తదితరులపై ఆర్‌సీఎన్ జారీ చేసిన తర్వాత కూడా వారు వివిధ దేశాల్లో తిరిగారని ఇంటర్ పోల్ గుర్తించింది. నీరవ్ పాస్‌పోర్టును సీబీఐ రద్దు చేసినప్పటికీ, అతను యథేచ్ఛగా దేశదేశాల్లో షికార్లు చేయడం చర్చనీయాంశమైంది. ఇలావుంటే, సీబీఐ అభ్యర్థనపై స్పందించిన యూకే అధికారులు నీరవ్ అక్కడే ఉన్నట్టు ప్రకటించారు. ఈ సమాచారాన్ని సీబీఐ వెంటనే విదేశాంగ శాఖకు తెలియచేసింది. నీరవ్‌ను అదుపులోకి తీసుకొని భారత్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని త్వరలోనే బ్రిటన్ అధికారులను భారత్ కోరనుంది. ఇలావుంటే, 2002 నుంచి ఇప్పటి వరకూ పలు కేసుల్లో నిందితులుగా ఉండి, ఇంగ్లాండ్‌కు పారిపోయిన మొత్తం 29 మందిని అప్పగించాల్సిందిగా భారత్ పదేపదే కోరుతునే ఉంది. వీరిలో విజయ్ మాల్య కూడా ఉన్నాడు. అయితే, తొమ్మిది పర్యాయాలు బ్రిటన్ అధికారికంగా ఈ అభ్యర్థనను తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 13 వేల కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపీ వేసిన నీరవ్‌ని అప్పగించే విషయంపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.