బిజినెస్

లక్ష్యాలను అధిగమించిన పారిశ్రామిక రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండి, రాష్ట్భ్రావృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగం లక్ష్యాలను అధిగమించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు మిషన్లలో ఒకటైన ఇండస్ట్రీ సెక్టార్ మిషన్ మంచి ఫలితాలను ఇస్తోంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వం భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది. మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబుల ప్రవాహం వెల్లువెత్తే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశం విజయవంతం కావడంతో లక్షా 50వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపే ప్రతి విదేశీ పర్యటన ఆశాజనకంగా సాగుతోంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మల్టీనేషనల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. పరిశ్రమల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో (2015-16) రాష్ట్రంలో పెద్ద పరిశ్రమల స్థాపన లక్ష్యం 45 కాగా, 48 పరిశ్రమలను స్థాపించారు. అలాగే వాటి పెట్టుబడి లక్ష్యం ఏడువేల 500 కోట్ల రూపాయలు కాగా, రూ.7,539.31 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ పరిశ్రమల ద్వారా 15వేల మందికి ఉపాధి కల్పించాలనుకుంటే 17వేల 608 మందికి ఉపాధి లభించింది. ఉన్న సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ-మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) రంగంలో మూడువేల యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా, 7657 యూనిట్లు స్థాపించారు. ఈ రంగంలో పెట్టుబడులు రూ.2,500 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందనుకుంటే రూ.3,938.58 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 50 లక్షల మందికి ఉపాధి చూపించాలనుకుంటే కోటీ 5వేల మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక రంగంలో ఈ విధంగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉండటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న విధంగా రెండంకెల అభివృద్ధి సాధించడానికి ఇది దోహదపడుతుంది.
జిల్లాల వారీగా నూతనంగా ఏర్పడిన పరిశ్రమల్లో పెట్టుబడులను పరిశీలిస్తే 409.89 శాతం లక్ష్యాలను సాధించి విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 329.81 శాతం పెట్టుబడులతో చిత్తూరు జిల్లా రెండవ స్థానం సాధించింది. అన్ని విధాల వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా 151.40 శాతం లక్ష్యాలను సాధించి మూడవ స్థానంలో నిలవడం విశేషం. విశాఖ జిల్లా పెట్టుబడుల లక్ష్యం రూ.833.31 కోట్లు కాగా, రూ.3415.65 కోట్లు, చిత్తూరు జిల్లా లక్ష్యం రూ.499.98 కోట్లు కాగా రూ.1649 కోట్లు, శ్రీకాకుళం జిల్లా లక్ష్యం రూ.332.90 కోట్లు కాగా, రూ.504 కోట్లు పెట్టుబడి పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా కేవలం 5.04 శాతం లక్ష్యాలతో చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాల విషయానికి వస్తే విజయనగరం జిల్లా లక్ష్యం రూ.333 కోట్లు కాగా రూ.52 కోట్లు (15.62 శాతం), తూర్పుగోదావరి జిల్లా లక్ష్యం రూ.833.31 కోట్లు కాగా రూ.42 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లా లక్ష్యం రూ.666.64 కోట్లు కాగా రూ.261.19 (39.18 శాతం) పెట్టుబడులు పెట్టారు. కృష్ణాజిల్లా లక్ష్యం రూ.833.31 కోట్లు కాగా రూ.551.20 (66.15శాతం), గుంటూరు జిల్లా లక్ష్యం రూ.833.31 కోట్లు కాగా రూ.95.12 కోట్లు (11.41 శాతం), ప్రకాశం జిల్లా లక్ష్యం రూ.666.64 కోట్లు కాగా రూ.77.08 కోట్లు (11.56 శాతం), నెల్లూరు జిల్లా లక్ష్యం రూ.667.64 కోట్లు కాగా రూ.577.27 కోట్లు (86.46 శాతం) పెట్టుబడులు పెట్టారు. కడప జిల్లా లక్ష్యం రూ.333.32 కోట్లు కాగా రూ.253.80 కోట్లు (76,14 శాతం), అనంతపురం జిల్లా లక్ష్యం రూ.333.32 కోట్లు కాగా రూ.38 కోట్లు (11.4 శాతం), కర్నూలు జిల్లా లక్ష్యం రూ.333.32 కోట్లు కాగా రూ.23 కోట్లు (6.90 శాతం) పెట్టుబడులు సమకూరాయి. ఈ పెట్టుబడుల లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,500 కోట్లు కాగా, 7,539.31 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంటే పారిశ్రామిక రంగం 100.52 శాతం లక్ష్యాలను సాధించి, ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడింది. ఈ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా కొత్త కంపెనీల స్థాపనతో పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.