బిజినెస్

పొదుపు పథకాలకు అధిక వడ్డీ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు ఇప్పటికీ పుజుకోని నేపథ్యంలో సేవింగ్స్ పథకాలపై ఎక్కువ వడ్డీ రేట్లు ఇవ్వడం భావ్యమా అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. దీనివల్ల రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడమేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొంటోందని ఆయన అభిప్రాయ పడ్డారు. సేవింగ్స్ పథకాలపై అధిక వడ్డీ రేట్లు ఉండే విచిత్ర పరిస్థితి మన దేశంలోనే ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు అధిక వడ్డీ రేట్లు ఇచ్చే, ఫలితంగా రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండే, ఫలితంగా మార్కెట్లు స్తబ్దుగా మారే ఇలాంటి పథకాలు ఉండాలా లేక మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లు లాంటి అదిక లాభాలను అందించే పథకాలు ఉండాలా అనేదే ప్రశ్న అని ఆయన అన్నారు. అన్ని ఆర్థిక కార్యకలాపాలకు మూలం పెట్టుబడేనని, వనరులు సమృద్ధిగా ఉన్నప్పుడే ఈ పెట్టుబడులు వస్తాయని శనివారం ఇక్కడ బిఎస్‌ఇ 140 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ జైట్లీ అన్నారు. ‘ఇలాంటి పథకాలు చాలా వాటిలో భద్రతతో కూడిన పెట్టుబడి ఉండడమే కాకుండా చాలా గౌరవప్రదమైన లాభాలు కూడా వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా పెన్షన్ ఫండ్స్ లాభసాటిగా ఉండడానికి అదే మూలకారణం. రాబోయే సంవత్సరాల్లో మనం అనుసరించాల్సిన మార్గం కూడా ఇదేనని నేను అనుకుంటున్నాను’ అని జైట్లీ చెప్పారు. దశాబ్దాలుగా వౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణలో ఉన్న లోటును భర్తీ చేయాలంటే సుదీర్ఘకాలం భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ఈ అన్ని కార్యకలాపాలకు స్టార్టింగ్ పాయింట్ పెట్టుబడే. వనరులను పెంచుకోవడం ద్వారానే ఇది రావాలి. ప్రైవేటు రంగంలోని ముఖ్యమైన కంపెనీలు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) మాత్రమే ఈ లోటును భర్తీ చేయగలదు’ అని ఆయన అన్నారు. ఈ విషయంలో బిఎస్‌ఇ ముఖ్యమైన పాత్ర పోషించగలదని కూడా జైట్లీ అభిప్రాయ పడ్డారు. ప్రైవేటు పెట్టుబడులు పెరగకపోవడానికి డిమాండ్ లేక పోవడమే కారణమని ఆయన అభిప్రాయ పడుతూ, పట్టణ ప్రాంత డిమాండ్ మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సారి వర్షాలు బాగా కురుస్తున్నందున గ్రామీణ ప్రాంత డిమాండ్ కూడా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని, ఇది ప్రైవేటు రంగానికి కూడా అవకాశంగా మారవచ్చని జైట్లీ అన్నారు.

చిత్రం.. బిఎస్‌ఇ 140 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తున్న జైట్లీ