బిజినెస్

బ్యాంకులకు భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: ప్రభుత్వ రంగ బ్యాంకులకు రోజు రోజుకూ భారం పెరుగుతోంది. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకుల్లో రూ.9.5 లక్షల కోట్ల మేర బకాయిలు వసూలు కావాల్సి ఉందని ఆలిండియా బ్యాంకు ఎంప్లారుూస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లారుూస్ అసోసియేషన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొండి బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులను కుదేలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వ్‌బ్యాంక్ లెక్కల ప్రకారం దేశంలోని 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.9.5 లక్షల కోట్ల వరకూ మొండి బకాయిలు ఉన్నాయన్నారు. ఒక్క భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బీఐ)లోనే రూ.2.5 లక్షల కోట్ల మేర మొండి బకాయిలున్నాయని చెప్పారు. పలు బ్యాంకులకు సంబంధించి రూ.7 లక్షల కోట్ల మేర న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.90 లక్షల కోట్ల మేర డిపాజిట్‌లు ఉండగా, రూ.58 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారన్నారు. ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్‌లను రుణాలుగా చెల్లించిన బ్యాంకులు వాటిని తిరిగి రాబట్టుకోలేని పక్షంలో డిపాజిట్ దార్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. బ్యాంకులు వేల కోట్ల రూపాయల మేర ముంచేసిన సంస్థలు, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ, ఇతర సమస్యలపై ఈ ఏడాది మే నెల 30, 31 తేదీల్లో సమ్మె చేశామని గుర్తు యూనియన్ ప్రతినిధులు గుర్తు చేశారు. 2017 నుంచి వేతన సవరణ జరగలేదని తక్షణమే వేతన సవరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లారుూస్ అసోసియేషన్, ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశాలు వచ్చే అక్టోబర్‌లో జరుగుతాయని ఉదయభాస్కర్ తెలిపారు.

చిత్రం. శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బ్యాంకు ఉద్యోగుల సంఘం
ప్రధాన కార్యదర్శి రాంబాబు