బిజినెస్

నగరంలో వజ్రాల మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: కీర్తిలాల్స్ వజ్రాభరణాల మేళాను ప్రారంభించింది. ఈ మేళాను వచ్చే నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కీర్తిలాల్స్ బిజినెస్ స్ట్రాటజీ డైరెక్టర్ సూరజ్ శాంత కుమార్ తెలిపారు. వివాహాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వజ్రాల నెక్లెస్ మేళాను నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. దక్షిణ భారత దేశంలో 11 ప్రత్యేక షోరూంలలో, న్యూఢిల్లీలో రిటైల్ కార్యాలయాల్లో కీర్తిలాల్స్ బ్రాండ్స్ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నామని అన్నారు. చిల్లర వర్తకంలోనూ, తయారీ కేంద్రాల విషయంలోనూ కూడా ఐఎస్‌ఒ 9001:2008 ధృవ పత్రాన్ని పొందిన తొలి నగల బ్రాండ్ని ఆయన వివరించారు. వజ్రాల నెక్లెస్ కార్నివాల్ ఆఫర్లు అందుబాటులో ఉన్న కీర్తిలాల్స్ షోరూంలను వినియోగదారులు వచ్చే నెల 15వ తేదీ వరకూ ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.