బిజినెస్

బంగారం మరింత ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 25: పుత్తడి ధర బాగా పుంజుకుంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి జోరుగా కొనుగోళ్లు జరగడంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం వల్ల బులియన్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి, రూ. 30,900కు చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ మేకర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో కిలో వెండి ధర రూ. 400 పెరిగి, రూ. 38,250కి చేరుకుంది. డాలర్ ఒత్తిడికి గురికావడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం వల్ల దేశీయ బులియన్ మార్కెట్‌లో సెంటిమెంట్ బలపడింది. బంగారమే సురక్షితమయిందిగా భావించి ఈ విలువయిన లోహాన్ని కొనుగోలు చేయడానికి ఇనె్వస్టర్లు మొగ్గు చూపారు. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే, న్యూయార్క్‌లో శుక్రవారం లావాదేవీలలో బంగారం ధర 1.75 శాతం పెరిగి ఒక ఔన్స్‌కు 1,205.30 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 2.14 శాతం పెరిగి, ఒక ఔన్స్‌కు 14.77 డాలర్లకు చేరుకుంది. ‘రక్షాబంధన్’ పండుగను దృష్టిలో పెట్టుకొని స్థానిక నగల వ్యాపారులు, రిటెయిలర్లు కొనుగోళ్లు పెంచడం కూడా బంగారం ధర పెరగడానికి దోహదపడింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర పది గ్రాములకు రూ. 250 చొప్పున పెరిగి, రూ. 30,900కు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర పది గ్రాములకు రూ. 250 చొప్పున పెరిగి, రూ. 30,750కు చేరుకుంది. బంగారం ధర శుక్రవారం పది గ్రాములకు రూ. 30 చొప్పున పెరిగింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా శనివారం ఢిల్లీలో కిలోకు రూ. 400 చొప్పున పెరిగి, రూ. 38,250కు చేరుకుంది. అయితే, వెండి నాణేల ధరలో శనివారం ఎలాంటి మార్పులేదు. వంద వెండి నాణేల కొనుగోలు ధర రూ. 72వేలు, విక్రయ ధర రూ. 73వేలుగా కొనసాగింది.