బిజినెస్

కొత్త ఆటోమోటివ్ ప్లాన్‌కు త్వరలోనే ఆమోదం : గీతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో అదనంగా 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యంతో ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ (ఎఎంపి) 2016-26 మరో నెల రోజుల్లో కేంద్ర క్యాబినెట్ పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. ప్రపంచంలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తి, ఎగుమతి, ఇంజనీరింగ్ రంగాల్లో అగ్రగాములుగా ఉన్న మూడు దేశాల్లో ఒకటిగా భారత ఆటోమొబైల్ రంగాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపితే కొత్త ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను ప్రారంభించేందుకు మార్గం సుగమమవుతుంది. ‘జాతీయ ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను 2026 సంవత్సరం వరకు పొడిగిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం త్వరలో పరిశీలించి ఆమోదించే అవకాశం ఉంది’ అని అనంత్ గీతే పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం తొలిసారి 2006-16 సంవత్సరాలకు ఆటోమోటివ్ మిషన్ ప్లాన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వంతో పాటు దేశ ఆటోమొబైల్ పరిశ్రమ దీనిని మరో పదేళ్లు పొడిగించి ఈ రంగంలో ఉత్పత్తిని రూ.18.89 లక్షల కోట్లకు పెంచాలని భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాయి. తొలి విడత ఎఎంపి (2006-16)లో 2.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యాన్ని ఆటోమొబైల్ రంగం అధిగమించగా, విదేశాలతో పాటు స్థానిక ఓఇఎంలు (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్లు), విడిభాగాల తయారీదారుల నుంచి రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యాన్ని మన దేశం అధిగమించింది.

చిత్రం.. కేంద్ర మంత్రి అనంత్ గీతే