బిజినెస్

పెద్ద నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఆర్థిక రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పరస్పరం విబేధించారు. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ చైర్మన్‌గా సీనియర్ ఎంపీ వీరప్ప మొయి లీ వ్యవహరించారు. ఈ కమిటీలో 31 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జీడీపీపై ప్రతికూలప్రభావం పడిందని, నిరుద్యోగం పెరిగిందని, నగదు సంక్షోభం తలెత్తిందని వీరప్ప మొయిలీ నివేదికలో పేర్కొన్నారు. కాని కమిటీలో మెజార్టీగా ఉన్న బీజేపీ సభ్యులు మాత్రం పెద్ద నోట్ల రద్దు ఉత్తమమైన సంస్కరణకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీల తరఫున అభిప్రాయాలను తెలియచేస్తూ ఎంపీ నిషికాంత్ దుబే లేఖ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ చొరవతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారన్నారు. నల్లధనం చలామణిని అడ్డుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాధిత్య సింధియా తదితర సభ్యుల ఉన్నారు. వీరప్ప మొయిలీ పార్లమెంటరీ కమిటీ తరఫున ముసాయిదా నివేదికను సిద్ధం చేశారు. పెద్దనోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. పెద్ద నోట్ల రద్దుకు దారితీసిన అంశాలపై ఒక సమగ్ర అధ్యయనం అవసరమని ఈ కమిటీ పేర్కొంది. దీని వల్ల ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం చలామణిలో ఉన్న పెద్ద నోట్లలో ఒక శాతం తప్ప మొత్తం నోట్లు తిరిగి వచ్చినట్లు వెల్లడైంది. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వీలు కల్పించారు. ఐదు వందల నోట్ల కరెన్సీ స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. అలాగే రెండు వేల కరెన్సీ నోటును అమలులోకి తెచ్చింది.