బిజినెస్

జీడీపీ గణాంకాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై తమ ప్రభావాన్ని కొనసాగిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) ఆగస్టు 31న ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలంలో దేశం సాధించిన జీడీపీ గణాంకాలను వెల్లడించనుంది. ‘సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని స్థూలార్థిక గణాంకాలు నిర్దేశించనున్నాయి. ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం శుక్రవారం జూన్ నెల త్రైమాసిక జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. ట్రేడర్లు ఎఫ్‌అండ్‌ఓ సెగ్మెంట్‌లో ఆగస్టు నెలలోని తమ పొజిషన్లను సెప్టెంబర్ నెలకు కొనసాగించుకోవలసి ఉంటుంది. అందువల్ల వచ్చే వారం మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది’ అని ఈక్విటీ 99లో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గత కొన్ని సెషన్ల నుంచి తీవ్రమయిన అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న రూపాయి కూడా వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనుంది. డాలర్‌తో పోలిస్తే మన దేశ కరెన్సీ రూపాయి మారకం విలువ ఆగస్టు 16న జీవనకాల కనిష్ట స్థాయి 70.32కు పడిపోయింది. ‘ముడి చమురు ధరల పెరుగుదల కొనసాగుతుండటం, దిగువ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటం ప్రాథమికంగా కనపడుతోంది. అధిక ముడి చమురు ధరలు దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ), ద్రవ్యోల్బణం, రూపాయిపై ప్రభావం చూపిస్తాయి. అందువల్ల షార్ట్ టర్మ్‌లో సూచీలు పైకి ఎగబాకటాన్ని నిరోధిస్తుంది’ అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. ‘వచ్చే వారంలో ట్రేడర్లు స్థూలంగా సెంటిమెంట్లను, మార్కెట్ కదలికలను అవగాహన చేసుకోవడానికి ఈ ముఖ్యమయిన అంశాలను పరిశీలిస్తారు’ అని ఆయన వివరించారు. అమెరికా, చైనా గత వారం పరస్పరం 25 శాతం (16 బిలియన్ డాలర్లు) దిగుమతి సుంకాలను విధించుకున్న తరువాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వాణిజ్య వివాదాల పరిష్కారానికి మార్గం కనుక్కోవడానికి ఇరు దేశాల మధ్య గత వారం జరిగిన చర్చలు కూడా ఎలాంటి పురోగతి లేకుండా అసంపూర్తిగానే ముగిశాయి. ‘అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చలు పరిష్కారం దొరకకుండానే ముగియడం, తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను అభిశంసించాలని వచ్చిన వాదనపై చేసిన ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది’ అని రెలిగేర్ బ్రోకింగ్ అధ్యక్షుడు జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 303.92 పాయింట్లు (0.80 శాతం) పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 86.35 పాయింట్లు (0.75 శాతం) పెరిగింది.