బిజినెస్

ఆశాజనకంగా విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి విదేశీ ఇనె్వస్టర్ల పెట్టుబడుల రాక ఈ నెలలో ఆశాజనకంగా ఉంది. విదేశీ మదుపరులు ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 6,700 కోట్లకు పైగా నిధులను భారత క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారు. దేశ స్థూలార్థిక గణాంకాలు మెరుగుపడటం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు బాగుండటం, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు దిద్దుబాటుకు గురికావడం వంటి సానుకూల అంశాల కారణంగా భారత క్యాపిటల్ మార్కెట్లు విదేశీ ఇనె్వస్టర్లను ఆకర్షించాయి. జూలై నెలలో భారత క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ మదుపరులు నికరంగా రూ. 2,300 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకు ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలంలో విదేశీ ఇనె్వస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 61,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఆగస్టు ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈక్విటీలలో రూ. 2,048 కోట్లు, డెబిట్ మార్కెట్‌లో రూ. 4,662 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంటే మొత్తం రూ. 6,710 కోట్లు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వరుసగా మూడు నెలల పాటు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు జూలై, ఆగస్టు నెలల్లో తిరిగి వెనక్కి రావడం మనకు ప్రోత్సాహకరమయిన అంశమని మార్కెట్ విశే్లషకులు పేర్కొన్నారు. ‘దేశ స్థూలార్థిక పరిస్థితులు మెరుగుపడటం, కార్పొరేట్ కంపెనీలు జూన్ త్రైమాసికంలో ప్రోత్సాహకరమయిన లాభాలను ఆర్జించడం, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్ల ధరలు దిద్దుబాటుకు గురికావడం, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత్ ఆర్థిక పరిస్థితిపై సానుకూల వ్యాఖ్యలు చేయడం వంటి అంశాల వల్ల ఇటీవల ఎఫ్‌పీఐల పెట్టుబడులు తిరిగి రాగలిగాయి’ అని మార్నింగ్ స్టార్‌లో సీనియర్ అనలిస్టు, మేనేజర్ రీసెర్చ్ హిమాంశు శ్రీవాత్సవ పేర్కొన్నారు.