బిజినెస్

నేడు ముంబయికి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో సోమవారం నిర్వహించే అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఆదివారం రాత్రి ఆయన ముంబై బయలుదేరి వెళ్లారు. ఉ. 9.05 గంటలకు జరిగే బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముంబై నగరంలో చంద్రబాబు పర్యటించనున్నారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా, చైర్మన్ చంద్రశేఖరన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ సీఈవో ప్రసాద్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఎండీ నడియార్ గోద్రెజ్, మహేంద్ర వరల్డ్ సిటీ డెవలపర్స్ సీఈవో సంజయ్ శ్రీవాత్సవ్, స్క్వేర్ గ్రూపు చైర్మన్ బాలన్, బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం, పిరామిల్ గ్రూపు ప్రతినిధులు, గ్రీన్స్ కాటన్, సెయింట్ గోబెన్ ఇండియా, రహేజా గ్రూపు, తదితర సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రికి విజయవాడ చేరుకుంటారు.