బిజినెస్

జీడీపీ లోటు తగ్గుతుంది: ఎస్‌బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తులు (జీడీపీ) లోటు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భార త బ్యాంకింగ్ దిగ్గజయం ఎస్‌బీఐ ఒక నివేదికలో తెలిపింది. దిగుమ తుల్లో తగ్గుదల, ఎగుమతుల పెరుగుదల వంటి కారణాలతో జీడీపీ లోటు 2.8 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో వాణిజ్యపరమైన అస్థిరత కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 160 బిలియన్ డాలర్లుగా ఉన్న మర్కడైజ్ ఇంబ్యాలెన్స్ ఈ ఆర్థిక సం వత్సరాంతానికి 188 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఎస్‌బీఐ ఎకోరా ప్ నివేదిక స్పష్టం చేసింది. కాగా, ముడిచమురు దిగుమతులు ఏకంగా 57.4 శాతం మేరకు పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. 2017 జూలై నాటికి 7.8 బిలియన్ డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయుల్ దిగుమ తులు 12.4 శాతానికి చేరుకున్నాయ. ఒక ఏడాదిలో ముడి చమురు ది గుమతులు ఈ స్థాయలో పెరగడం ఇదే మొదటిసారి. ఈ కారణంగా నే విదేశీ మారక వినియోగం కూడా పెరుగుతున్నది. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, జీడీపీ లోటు తగ్గడం ఖాయంగా కనిపిస్తు న్నదని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంటున్నది. దీనిని ఆశాజన పరిణామమని ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.