బిజినెస్

మూడు పైసలు బలపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 27: డాలర్ మారకపు విలువతో పోలిస్తే దారుణంగా పడిపోతున్న రూపాయి ఊపిరి పీల్చుకుంది. మూడు పైసల మేర బలపడింది. 69.91 రూపాయలుగా ఉన్న మారకపు విలువ సోమవారం 69.88 రూపాయలకు చేరింది. దేశీయ ద్రవ్యం తీవ్ర ఒత్తిళ్ల మధ్య 69.65 నుంచి 70.00 మధ్య ఊగిసలాడి, 69.88 వద్ద స్థిరపడింది. సెనె్సక్స్, నిఫ్టీ పరుగులు పెడుతున్న నేపథ్యంలో రూపాయి క్రమంగా కోలుకుంటున్నది. ప్రస్తుత అంత ర్జాతీయ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, డాలర్ విలు వ పడిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగితే అది రూపాయకి లాభం.
వనె్న పెరిగిన బంగారం
ముంబయి, ఆగస్టు 27: ఒకవైపు మదుపరుల ఆసక్తి, మరోవైపు పండుగ సీజన్.. ఈ రెంటి ప్రభావంతో పసిడి ధర పరుగు సోమవారం ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కొంత ఆనాసక్తత కనిపించినా, దేశంలో పండుగల ఒకదాని తర్వాత మరొకటిగా వస్తుండడంతో బంగారం ధర క్రమంగా పెరుగుతున్నది. సోమవారం 10 గ్రాముల ధర 31,000 రూపాయల మైలురాయిని అధిగమించడం విశేషం. బంగారంతోపాటు వెండి ధర సైతం మెరుగుపడింది. ఒక దశలో కిలో వెండి 39,500 వరకూ చేరింది.