బిజినెస్

నష్టాలకు ఫుల్‌స్టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు, నష్టాలకు ఫుట్‌స్టాప్ పెట్టాలని చాలాకాలంగా యోచిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాయి. నష్టాల్లో నడుస్తున్న కొన్ని విదేశీ శాఖలను మూసివేయాలని సోమవారం తీర్మానించాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన శాఖలు విదేశాల్లో ఉండగా, వాటిలో గత ఆర్థిక సంవత్సరంలో 41 శాఖలు భారీ నష్టాలను చవిచూశాయి. దీనితో ఆయా బ్రాంచీలను మూసి వేయడంగానీ, హేతుబద్ధీకరించడంగానీ చేయాలని బ్యాంకులు ఒక నిర్ణయానికి వచ్చాయి. నష్టపోయిన శాఖలు ఉన్న బ్యాంకుల్లో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఈ మూడు బ్యాంకులకు వరుసగా 52, 29, 50 చొప్పున విదేశీ శాఖలు ఉన్నాయి. నష్టాలను ఎదుర్కొంటున్న శాఖలను కొనసాగించడంలో ఔచిత్యం లేదని పలు బ్యాంకులు భావిస్తున్నాయి. ఖర్చులను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు నష్టాల్లో నడుస్తున్న బ్రాంచీలను పరస్పర అంగీకారంతో హేతుబద్ధీకరించడం లేదా మూసివేయడం చేయాలని తీర్మానించాయి.