బిజినెస్

రవాణా చార్జీల నియంత్రణే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 27: ఇసుకను రవాణా చేసే వాహనాల చార్జీలపై నియంత్రణ లేకపోతే ఉచిత ఇసుక విధానం విజయవంతమయ్యేలా కనిపించడం లేదు. పలు జిల్లాల్లో అధికారికంగా గుర్తించిన రీచ్‌ల్లో చాలా చోట్ల నోరున్నవారిదే రాజ్యంగా తయారవుతున్న నేపథ్యంలో ఇసుక రవాణా చేస్తున్న వాహనాల యజమానులు కూడా వినియోగదారుల నుండి భారీగానే వసూలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. దీనికితోడు ఇసుక రీచ్‌లపై సరైన నిఘా లేకపోవటం వల్ల రీచ్‌ల బాటల నిర్వహణ పేరుతో కొంత, తత్కాల్‌లో ఇసుక సరఫరా చేసేందుకు మరికొంత ఇలా ఎలాబడితే అలా వినియోగదారుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్టు సమాచారం అందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంది.
దాంతో ఇసుక రీచ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచే బాధ్యతను పోలీస్, రెవెన్యూతో పాటు పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇందు లో భాగంగానే రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప, పోలీసు ఉన్నతాధికారులు జిల్లాల్లోని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్‌ల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదాయాన్ని వదులుకుని ఇసుకను ఉచితంగా అందిస్తుంటే, అక్రమార్కులు ఇసుక దోపిడీకి పాల్పడుతుండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దాంతో ఇసుక రీచ్‌లు ఉన్న జిల్లాల్లో డిఎస్పీ స్థాయి అధికారులు గత నాలుగు రోజులుగా ఇసుక నిల్వలపైనా, అక్రమ తవ్వకాలపై దాడులు చేసి ట్రాక్టర్లు, లారీలను సీజ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
అయితే ఎన్ని చర్యలు చేపట్టినాగానీ రవాణా చార్జీలపై నియంత్రణ లేకపోవటంతో ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరటం లేదు. జిల్లాలో అధికారికంగా గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో రెవెన్యూ లేదా పంచాయతీరాజ్‌కు చెందిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి రవాణా చార్జీలను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఇసుక రీచ్‌లోనే రవాణా చార్జీకి సంబంధించిన బిల్లును దూరాన్ని బట్టి లెక్కించి అధికారులు రాసిస్తే, దాని ప్రకారం వినియోగదారులు చెల్లించే విధానాన్ని అమలు చేయాలి. ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే తప్ప ప్రభుత్వం కల్పించిన ఉచిత ఇసుక ప్రయోజనాలను వినియోగదారులు పొందలేరు.