బిజినెస్

ఎన్‌టిపిసి నుంచి కెవిఐసికి రూ.5.34 కోట్ల ఆర్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) నుంచి తమకు 5.34 కోట్ల రూపాయల ఆర్డర్ లభించిందని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) శనివారం వెల్లడించింది. ఎన్‌టిపిసి ఉద్యోగుల కోసం 23 వేల స్లీవ్‌లెస్ జాకెట్లు తయారుచేసి ఇవ్వాలంటూ ఈ ఆర్డర్ వచ్చిందని, దీని వలన తమకు 5,34 కోట్ల రూపాయల ఆదాయం ఒనగూడుతుందని కెవిఐసి ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్‌టిపిసి నుంచి తమకు ఇటువంటి ఆర్డర్ రావడం ఇదే మొదటిసారని, దీని వలన తమకు 20 వేల గంటల అదననపు పని లభిస్తుందని, ‘ఖద్దరు కతియా సిల్కు’ వస్త్రంతో పాటు డిజైనర్ గుండీలతో ఈ జాకెట్లను తయారుచేసి రెండు నెలల్లో ఆ సంస్థకు అందజేస్తామని కెవిఐసి చైర్మన్ వికె.సక్సేనా వివరించారు. ఇదిలావుంటే, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ముంబయి ఐఐటి ఇకమీదట తమ స్నాతకోత్సవాల్లో ఖద్దరు ఉత్పత్తులను ఉపయోగించాలని నిర్ణయించుకుని 3,500 ‘ఉత్తరీయాల’ కోసం ఆర్డర్ ఇచ్చిందని కెవిఐసి వెల్లడించింది.