బిజినెస్

కెన్యాతో వాణిజ్య దోస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కెన్యాతో వాణిజ్యపరమైన స్నేహ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. కెన్యాలో ప్రాధాన్యతా రంగాలను గుర్తించాలని, తద్వారా ఆ దేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. నైరోబీలో కెన్యా పరిశ్రమ, వాణిజ్య, సహకార శాఖ మంత్రి పీటర్ మున్యాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న ప్రభు, అందులోని కీలక అంశాలను ట్వీట్ చేశారు. ఇరు దేశాల సంయుక్త వ్యాపార మండలి సమావేశానికి రెండు దేశాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. వ్యాపారం నుంచి పరిశోధన వరకూ వివిధ రంగాల్లో పెట్టుబడులకు భారత్ సిద్ధంగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే, కెన్యాలో ప్రాధాన్యతా రంగాలను గుర్తించాల్సిందిగా వ్యాపారవేత్తలను కోరారు. ఆయా రంగాల్లో పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం దక్కుతుందని చెప్పారు. కెన్యా వాణిజ్య మంత్రితోపాటు విదేశాంగ ముఖ్య కార్యదర్శి అబాబూ నంవాంబాతోనూ ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్టు ప్రభు తెలిపారు. కెన్యాతో లాజిస్టిక్స్, వ్యవసాయం, విద్యుత్, ఫార్మా వంటి పలు రంగాల్లో వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవచ్చని భారతీయ వ్యాపారవేత్తలకు ఆయన సూచించారు. కెన్యాకు మన దేశం నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1.97 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయిన విషయాన్ని ప్రభు ప్రస్తావించారు. అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.11 బిలియన్ డాలర్లుగా ఉండిందన్నారు. అందుకే, తిరిగి కెన్యాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడి, ఎగుమతులు పెరగాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు చెప్పారు. కెన్యా పర్యటన సంతృప్తిగా కొనసాగిందని, అనుకున్న లక్ష్యాలను చేరగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.