బిజినెస్

అదానీ పవర్ చేతికి చత్తీస్‌గఢ్ పవర్‌ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: చత్తీస్‌గఢ్‌లోని జీఎంఆర్ ఇన్‌ఫ్రా పవర్ ప్లాంటును గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ లిమిటెడ్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. చాలారోజులుగా ప్రతిపాదన దశలో ఉండగా, ఇది కొలిక్కి వచ్చినట్లు సమాచారం. చత్తీస్‌గఢ్‌లోని జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు చెందిన 1,370 మెగావాట్ల పవర్‌ప్లాంటుపై భారీగా రుణభారం ఉండడంతో అప్పును ఈక్విటీ మూలధనంగా మార్చారు. రుణదాతలైన బ్యాంకులు, ఆర్థికసంస్థలకు 50 శాతానికి మించిన వాటా లభించగా, ఆ తర్వాత విక్రయంచేందుకు బిడ్లు ఆహ్వానించగా, అదానీ పవర్ లిమిటెడ్ సొంతం చేసుకుంది.