బిజినెస్

‘తేజ్’ కాదు.. గూగుల్ పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, ఆగస్టు 28: సులభంగా డబ్బులు పంపేందుకు వీలుగా గూగుల్ ప్రవేశపెట్టిన గూగుల్ పేమెంట్ సర్వీస్ తేజ్ పేరు మారింది. ఢిల్లీలో జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా 2018’ కార్యక్రమంలో ‘గూగుల్ పే’ మార్చినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్‌లో ఆన్‌లైన్ పేమెంట్లు చేసేందుకు వీలుగా ఆన్‌లైన్, ఇన్‌స్టోర్స్ ఆప్షన్లను కొత్తగా ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. దీంతోపాటు ప్రీ అప్రూవ్డ్ లోన్లను యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్ బ్యాంకు, కొటక్ మహీంద్రా వంటి బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. గూగుల్ పేను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే భారత్‌లో 2.2కోట్ల మంది ఈ యాప్‌ను వినియోగించగా, తక్కువ కాలంలోనే 75 కోట్ల లావాదేవీలు జరిగాయ.