బిజినెస్

ముడి ఉక్కు ఉత్పత్తిలో రెండో స్థానానికి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ముడి ఇనుము ఉత్పత్తిలో భారత్ రెండో స్థానానికి చేరింది. ఈ మాసంలో ఉత్పత్తి 90 లక్షల టన్నులకు చేరుకుంది. చైనా 8 కోట్లా 12 లక్షల టన్నులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్‌కు రెండో స్థానం దక్కింది. టాప్-10లో చైనా, భారత్ తర్వాత మూడో స్థానంలో జపాన్ ఉంది. 84.20 లక్షల టన్నుల ఉక్కును జపాన్ ఉత్పత్తి చేస్తున్నది. కాగా, నాలుగు నుంచి పది స్థానాల్లో వరుగా అమెరికా (72.75 లక్షలు), దక్షిణ కొరియా (61.77 లక్షలు), రష్యా (61.70 లక్షలు), జర్మనీ (39 లక్షలు), టర్కీ (32.66 లక్షలు), బ్రెజిల్ (3,022 లక్షలు), ఇటలీ (22.10 లక్షల టన్నులు) ఉన్నాయి. ఇలావుంటే, భారత్ గత ఏడాది జూలై మాసంలో 83.30 లక్షల టన్నులను ఉత్పత్తి చేయగా, ఆతర్వాత క్రమంగా పుంజుకుంటూ 90 లక్షల టన్నుల మైలురాయిని చేరింది.