బిజినెస్

బుల్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 28: జాతీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ దూకుడు కొనసాగుతున్నది. మంగళవారం కూడా లావాదేవీలు లాభాలతో మొదలయ్యాయి. సెనె్సక్స్ 202.52 పాయింట్లు పెరిగి, 38,896.63 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ మదుపరులు కూడా వివిధ కంపెనీల షేర్లపై ఆసక్తి ప్రదర్శించడంతో, బుల్ రన్ ఎలాంటి ఆటం కం లేకుండా దూకుడుగా ముందుకు దూసుకెళ్లింది. 38,814.76 పాయింట్లతో మొదలైన ట్రేడింగ్ ఒకానొక దశలో అత్యధికంగా 38,938 పాయింట్ల వరకూ వెళ్లింది. మంగళవారం నమోదైన అత్యల్ప పాయింట్లు 38,760.58. నిఫ్టీ సైతం లాభాలతో ముగిసిం ది. 46.55 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 11,738.50 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 11,700 పాయింట్ల మైలురాయిని అధిగమించడం ఇదే మొదటిసారి. ఇలావుంటే, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి (బీఎస్‌ఈ)లో వేదాంత (2.20 శాతం), అదానీ పోర్ట్స్ (2.20 శాతం), రిలయన్స్ (1.72 శాతం), యాక్సిస్ బ్యాంక్ (1.62 శాతం) లాభాలను ఆర్జించింది. అదే విధంగా మారుతీ సుజీకీ, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ సైతం లాభాల బాటలో నడిచాయి. కాగా, ఎస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో హిండాల్‌కో (4.17 శాతం), రిలయన్స్ (2.34 శాతం), అదానీ పోర్ట్స్ (2.34 శాతం), వేదాంత (2.15 శాతం), మారుతీ సుజుకీ (1.75 శాతం) లాభపడ్డాయి. గెయిల్, ఎస్ బ్యాంక్, హెచ్‌పీసీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ నష్టాలను చవిచూశాయి.